వారంలో కులగణన నివేదిక?
ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో స్వతంత్ర నిపుణుల కమిటీ సమావేశం
హైదరాబాద్, జూలై 2 (విజయక్రాంతి): రాష్ట్రంలో చేపట్టిన కులగణ నను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన స్వతంత్ర నిపుణుల కమిటీ తన నివేదికను సిద్ధం చేస్తోంది. త్వరలోనే ప్రభుత్వానికి కూడా అందించనున్నది. బుధవారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ లో కమిటీ చైర్మన్ జస్టిస్ సుదర్శన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నివేదికకు తుది మెరుగులు దిద్దారు.
కులగణనలో పేర్కొన్న 242 కులాల వెనుకబాటుతనానికి సంబంధించి కంపొజిట్ బ్యాక్‌వర్డ్‌నెస్ ఇండెక్స్(సీబీఐ) సూచీని నివేదికలో పొందుప ర్చారు. 300 పేజీలకు పైగా రూపొందించిన నివేదికలో 242 కులాల వారీగా వెనుకబాటుపై సీబీఐ స్కోర్, ర్యాంకులకు ఇచ్చింది. మరో వారం రోజుల్లో నివేదిక సిద్ధమవుతుంది. నివేదికను అందించడానికి సమయం ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టిని కమిటీ కోరింది.




