15 April, 2026 | 1:14 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

అర్హులకే సంక్షేమ పథకాలు

01-06-2025 12:23 AM

ఖరీఫ్ సాగుకు అంతా సిద్ధం చేయాలి: మంత్రి సీతక్క 

మంచిర్యాల, మే 31 (విజయక్రాంతి): ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా చూడాలని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి, ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క అన్నారు.

శనివారం మంచిర్యాల కలెక్టరేట్‌లో మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో భూభారతి, ఇంది రమ్మ ఇండ్లు, యాసంగి వరి ధాన్యం సేకరణ, ఖరీఫ్ సాగు సన్నద్ధం అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రైతుల ఎదుర్కొంటున్న భూసమస్యల పరిష్కా రం కోసం భూభారతి నూతన ఆర్‌ఓఆర్ చట్టం తెచ్చామని చెప్పా రు. జూన్ 3 నుంచి 20 వరకు అన్ని మండలాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పా రు. ఆదివాసీలకు ఐదు వేల ఇందిరమ్మ ఇండ్లు ప్రత్యేకంగా కేటాయించామన్నారు.

ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందే వస్తున్నందున ఖరీప్ సాగుకు వ్యవసాయ శాఖ సన్నద్ధం కావాలని మంత్రి సీతక్క కోరారు. రైతులకు అవ సరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలలో ప్రకృతి వైపరీత్య నియంత్రణ కమిటీలను ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

జూన్ 12న విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న దృష్ట్యా సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు. అనంతరం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కిశోర బాలికలకు ఇందిరమ్మ అమృతం పథ కం కింద పల్లీలు, చిరుధాన్యాలతో తయారుచేసిన చిక్కీల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారం భించారు.

ఈ సమావేశంలో కలెక్టర్లు కుమార్ దీపక్, వెంకటేష్ దోత్రే, రాజర్షిషా, అభిలాష అభినవ్, ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, గడ్డం వినోద్, రామారావు పటేల్, ఎమ్మె ల్సీలు మల్క కొమురయ్య, దండే విఠల్, సమ గ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా, జీసీసీ చైర్మన్ కొట్నాక తిరుపతి, అధికారులు పాల్గొన్నారు.