2 July, 2026 | 4:04 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి కృషి

28-06-2024 05:12 AM
  • ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య

అబ్దుల్లాపూర్‌మెట్, జూన్ 27 : అబ్దుల్లాపూర్‌మెట్ మండలం గౌరెల్లిలో లక్ష్మీ నర్సింహాస్వామి ఆలయాన్ని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య సందర్శించారు. గురువారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆల య కమిటీ సభ్యులు బీర్ల అయిలయ్యను శాలువతో సన్మానించి, జ్ఞాపకను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. గౌరెల్లి లక్ష్మీనర్సింహాస్వామి ఆల య అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చా రు. కార్యక్రమంలో కాంగ్రెస్ సోషల్ మీడి యా మండల కో మూల ప్రవీణ్ కుమార్, పెద్ద అంబర్‌పేట్ కౌన్సిలర్ గ్యారాల శ్రీనివాస్‌గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

పెట్టుబడులకు కంపెనీలు ముందుకొస్తున్నాయి..  

మహేశ్వరం, జూన్ 27: హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకు వస్తున్నాయని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. గురువారం వనస్థలిపురంలో ధరణి రియల్ ఎస్టేట్ అండ్ డెవలపర్స్ నూతన కార్యాలయాన్ని బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు కామ్య మల్లేశ్‌తో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో మున్సురాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహరెడ్డి, డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ కాసం వెంకటేశ్, ధరణి రియల్ ఎస్టేట్ అండ్ డెవలపర్స్ డైరెక్టర్ సైదులు తదితరులు పాల్గొన్నారు.