13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

వెల్‌నెస్ సెంటర్లను బలోపేతం చేయాలి

27-03-2026 12:31 AM
  1. ఆరోగ్యశాఖ కార్యదర్శికి ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి వినతి
  2. త్వరలోనే ఏర్పాటు‚చేస్తామని హామీ

హైదరాబాద్, మార్చి 26 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12 వెల్‌నెస్ సెంటర్లలో మందుల కొరతను పరిష్క రించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టియానా చోంగ్తును గురువారం ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి, పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పేరి వెంకట్ రెడ్డి కలిసి వినతిపత్రం సమర్పించారు. పెన్షనర్లకు షుగర్, బీపీకి సంబంధించిన మందుల కొరత ఉందన్నారు.

దీనిపై క్రిస్టియానా స్పందిస్తూ వెల్‌నెస్ సెంటర్లను మెడికల్ కాలేజీలకు అనుబంధ ఆస్పత్రులతో అనుసం ధానం చేశామని, అక్కడ వైద్యులు అన్నిరకాల వ్యాధులకు చికిత్సను అందిస్తున్నారని తెలిపారు. నూతన జిల్లాలకు సంబంధించి మరో 22 జిల్లాల్లో వెల్‌నెస్ సెంటర్లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు ప్రభు త్వం వద్ద ఉందని, బడ్జెట్  కేటాయింపుల తర్వాత నెల రోజుల్లో అన్ని జిల్లాల్లో వెల్‌నెస్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని శ్రీపాల్ రెడ్డి పేర్కొన్నారు.