27 March, 2026 | 2:24 AM

బియ్యం వ్యాపారి ఇంట్లో సోదాలు

27-03-2026 12:32 AM
  1. తనిఖీ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు బృందం
  2. నకిలీ బియ్యం విక్రయిస్తున్నట్లు ఆరోపణలు
  3. పలు రాష్ట్రాల వ్యాపారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైకోర్టు ప్రతినిధులు

మిర్యాలగూడ, మార్చి 26 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో బియ్యం వ్యాపారి ఇంట్లో గురువారం ఢిల్లీలోని హైకోర్టు అడ్వకేట్ జనరల్ బృందం తనిఖీ కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు మిర్యాలగూడ పట్టణానికి చెందిన ప్రముఖ బియ్యం వ్యాపారి చీదళ్ళ గోపి ఇంట్లో ,వ్యాపార కార్యాలయం తదితర ప్రాంతాల్లోఢిల్లీ హైకోర్టు అడ్వకేట్ జనరల్ ప్రతినిధులు గురువారం విస్తృత తనిఖీలు నిర్వహించారు.

రాష్ట్రంలో పలురకాల బియ్యం బస్తాల బ్రాండ్లను నకిలీవి ముద్రిం చి వ్యాపారం సాగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే బస్తాల ముద్రణలకు ఎలాంటి అనుమతులు లేకుండా దేశంలోని వివిధ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్లుగా ఆయనపై ఆరోపణలు వ్యక్తమవుతున్నా యి. దీంతో కర్ణాటక, తమిళనాడు, తెలంగాణకు చెందిన పలువురు బియ్యం బ్రాండెడ్ వ్యాపారులు ఢిల్లీ హైకోర్టులో గోపిపై ఫిర్యాదులు చేశారు.దీంతో హైకోర్టు ప్రత్యేకంగా అడ్వకేట్ జనరల్‌లను నియమించి తనిఖీలకు ఆదేశించారు.

హైకోర్టు బృందం ప్రతిని ధులు ఒకటో పట్టణ సీఐ నాగభూషణ్ రావు ను కలిసి పోలీసుల ఎస్కార్ట్ సహాయంతో తనిఖీలు చేపట్టారు. గోపికి చెందిన పట్టణంలోని బ్లూవేల్ ప్యాలెస్‌తో పాటు రెడ్డి కాలనీలో ఆయన నివాసంతో పాటు వ్యాపార సంస్థల్లో తనిఖీలు చేశారు.

ఎఫ్‌సీఐ సమీపంలో బ్రాండెడ్ బస్తాలను ముద్రిస్తున్న పరిశ్రమలో విస్తృతంగా తనిఖీలు చేసి పలు బ్రాండ్లకు సంబంధించిన బస్తాలను వారు స్వాధీనం చేసుకున్నారు. పిడుగురాళ్లలోని మరో బస్తాల ముద్రించే కేంద్రంలో ప్రధానంగా మిర్యాలగూడకు చెందిన బ్రాండ్ల బస్తాలను ముద్రిస్తున్నట్టు వారు గుర్తించారు. ఢిల్లీలోని హై ఆడ్వకేట్ జనరల్ బృందం బియ్యం వ్యాపారిపై తనిఖీల చేయడం పట్టణంలో బియ్యం వ్యాపారుల్లో చర్చనీయాంశంగా మారింది.