calender_icon.png 9 January, 2026 | 6:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో నేరాల నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారించాలి

07-01-2026 12:00:00 AM

నిజామాబాద్ సీపీ సాయి చైతన్య 

నిజామాబాద్, జనవరి 26 (విజయ క్రాంతి): నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించి సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిజామాబాద్, ఆర్మూర్ , బోధన్ డివిజన్ పరిధిలో పెండింగ్లో ఉన్న కేసుల పురోగతి పై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మంగళవారం సమగ్ర సమీక్ష సమావేశం చేపట్టారు. ఈ సమావేశంలో అన్ని డివిజన్ల ఏసీపీలు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ సి.ఎం. ఆర్ కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేయాలని సాక్ష్యాల సేకరణలో నిర్లక్ష్యం లేకుండా చూడాలని కోర్టుల్లో కేసుల ప్రాసిక్యూషన్ బలోపేతం చేయాలని ఆదేశించారు.

ప్రత్యేకంగా ఎక్కువకాలంగా పెండింగ్లో ఉన్న కేసులను ప్రాధాన్యతగా తీసుకుని త్వరితగతిన పరిష్క రించాలని సూచించారు. కేసుల పురోగతిని తరచూ సమీక్షిస్తూ బాధ్యతాయుతంగా పనిచేయాలని అధికారులకు స్పష్టం చేశారు. నిజామాబాద్ లో పెరుగుతున్న వైట్ కాలర్ నేరాలపై ప్రధానంగా సైబర్ మోసాలు, బ్యాంకింగ్ ఫ్రాడ్లు, ఆర్థిక నేరాలు, నకిలీ పత్రాల తయారీ వంటి అంశాలపై చర్చించి, కేసుల నమోదు. దర్యాప్తు పురోగతి, నేరాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. ప్రత్యేక బృందాల ఏర్పాటు చేయాలని, సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలని ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. బాధితులకు త్వరిత న్యాయం అందేలా చూడాలని సూచించారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలలో బ్లాక్ స్పాట్లను గుర్తించి, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. హైవే రోడ్డులను కలుపుతూ ఉండేటటువంటి లింకు రోడ్లకు స్పీడ్ బ్రేకర్లు వేయించడం, రోడ్డుకు అడ్డుగా ఉన్న పొదలను తొలగించే విధముగా చూడాలని అన్నారు. రోడ్డు ఇంజనీరింగ్ లోపాలు ఉన్నట్లయితే నేషనల్ హైవే  స్టేట్ హైవే అథారిటీ ఇతర సంబంధిత అధికారులతో సమన్వయంతో ప్రమాదాల నివారణకు కృషి చేయాలని సూచించారు.

రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి రోజు మీ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్లు నిర్వహించాలని, ఓవర్ స్పీడ్, త్రిబుల్ డ్రైవింగ్, మైనర్ల రోడ్డు ప్రమాదాలఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వా రెడ్డి, నిజామాబాద్ ఏసిపి రాజా వెంకటరెడ్డి, బోధన్ ఏసిపి శ్రీనివాస్, ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ, సైబర్ క్రైమ్ ఏసిపి వై. వెంకటేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, సిసిఆర్బి సిఐ రమేష్  సిఐలు, ఎస్త్స్రలు, ఐటి కోర్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.