మళ్లీ ధరల మంటలు తప్పవా?
ఇటీవల అమెరికా ఇరాన్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో పశ్చిమాసియా సంక్షోభానికి తెరపడిందని యావత్ ప్రపంచం ఊపిరి పీల్చుకున్నది. 60 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించడం, కీలకమైన అంశాల్లో ఇరాన్, అమెరికా మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్టు వార్తలు రావడంతో ఇక యుద్ధం ముగిసినట్టేనని, చమురు సంక్షోభం ముగుస్తుందని, ఇంధన ధరలు దిగివస్తాయని అందరూ భావించారు. కానీ, శాంతి చర్చలు ఓ కొలిక్కిరాకముందే మరోసారి ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తడం శోచనీయం.
రెండు దేశాలు భీకర దాడులకు దిగడంతో మరోసారి పశ్చిమాసియా దద్దరిల్లుతున్నది. దీంతో మరోసారి పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. గతంలో నాలుగు నెలలపాటు కొనసాగిన యు ద్ధం వల్ల ప్రపంచ వాణిజ్యం పూర్తిగా స్తంభించిపోయింది. హోర్ముజ్ మూసివేతతో చమురు ధరలు మండిపోయాయి. ముఖ్యంగా మన దేశంలో అన్ని వస్తువుల ధరలకు రెక్కలొచ్చాయి. గత అనుభవాల దృష్ట్యా ప్రపంచ దేశాలు, అంతర్జాతీయ సంస్థలు ముందుకొచ్చి ఈ పోరుకు శాశ్వత ముగింపు పలకాల్సిన అవసరం ఉంది.
శివకుమార్, హైదరాబాద్






