22 July, 2026 | 1:23 AM

తడిపొడి చెత్త వేరు చేసి వాహనాలకు అందించాలి

22-07-2026 12:45 AM

రాఘవపల్లిలో స్వచ్ఛభారత్పే ఇంటింటి అవగాహన కార్యక్రమం

నాగిరెడ్డిపేట,జూలై 21 (విజయ క్రాంతి):స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా రాఘవపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో తడి, పొడి,శానిటరీ,ప్రత్యేక జాగ్రత్త చెత్తను వేర్వేరుగా సేకరించి ఇంటింటికి వచ్చే చెత్త సేకరణ వాహనాలకు అందించాలని గ్రామ ప్రజలకు గ్రామ సర్పంచ్ నార్ల గంగమని మల్లేష్ అవగాహన కల్పించారు.

ఇంటింటికి వెళ్లి చెత్త వర్గీకరణ ప్రాముఖ్యతను వివరించిన అధికారులు,పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని,డ్రైనేజీల్లో ఎలాంటి చెత్తను వేయకుండా గ్రామాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో రాఘవపల్లి గ్రామ సర్పంచ్ నార్ల గంగామణి మల్లేష్,ఉప సర్పంచ్ చెన్నం సూరయ్య, గ్రామ పాలకవర్గ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి కిష్టయ్య,కాంగ్రెస్ కార్యకర్తలు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.