22 July, 2026 | 2:00 AM

రహదారి భద్రతపై కఠిన చర్యలు తీసుకోవాలి

22-07-2026 01:20 AM

కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి, జూలై 21 ( విజయక్రాంతి ) :  జిల్లాలో రహదారి భద్రతను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. మంగళవారం రహదారులు & భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్, ఎస్పీ సునీత రెడ్డి, అదనపు కలెక్టర్ ఖీమ్య నాయక్ పాల్గొన్నారు. జాతీయ రహదారుల వెంట భారీ వాహనాల పార్కింగ్ను నిరోధించడం,

రోడ్లపై ఆక్రమణలు తొలగించడం, బ్లాక్ స్పాట్లను గుర్తించి చర్యలు తీసుకోవడం, టాస్క్ ఫోర్స్ బృందాలను చురుకుగా పనిచేయించడం వంటి అంశాలపై అధికారులకు కలెక్టర్ సూచనలు చేశారు . అలాగే పోలీసు, రవాణా శాఖల పెట్రోలింగ్ను బలోపేతం చేసి, ట్రామా కేర్ సెంటర్ల వివరాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఆర్ & బీ ఈఈ పరిమళ, డీటీఓ సురేష్ అధికారులు పాల్గొన్నారు.