22 July, 2026 | 2:36 AM

ఇషాన్ అర్విక్ మెరుగైన వైద్య సేవలు అందించండి

22-07-2026 01:22 AM

అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఇషాన్ ను గచ్చిబౌలి కిమ్స్ హాస్పిటల్ లో పరామర్శించిన మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి 

జడ్చర్ల, జూలై 21 : పట్టణానికి చెందిన రాకేష్,శ్రీలేఖ దంపతుల కుమారుడు ఇషాన్ అర్విక్ మెదడు ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ నలభై ఐదు రోజులుగా గచ్చిబౌలి కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ఇషాన్ ను  మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి పరామర్శించారు.తీవ్ర దుఃఖంలో ఉన్న చిన్నారి తల్లితండ్రులను ఓదార్చారు. ఇషాన్ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. కిమ్స్ వైద్యులు ఇషాన్ కు అందిస్తున్న చికిత్స గురించి మాజీ మంత్రికి తెలియజేశారు.

తల్లితండ్రులు తమ శక్తికి మించి ఇప్పటికే ఖర్చు చేశారని వైద్యుల దృష్టికి తీసుకెళ్లారు. ట్రీట్మెంట్ ఖర్చు గురించి అన్ని విధాల సహరించాలని మాజీ మంత్రి హాస్పిటల్ యాజమాన్యాన్ని కోరారు. చిన్నారి ఇషాన్  కోలుకొని, సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవుతాడని మాజీ మంత్రి ఆకాంక్షించారు.ఇషాన్ కు వ్యాధి పూర్తిగా నయం అవుతుందని, ఆందోళన వద్దని తల్లితండ్రులకు మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి భరోసా ఇచ్చారు.