calender_icon.png 10 August, 2025 | 1:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పురపాలికపై పట్టింపేది?

07-08-2025 12:43:53 AM

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పురపాలిక పరిధిలోని పలు కాలనీల్లో అధ్వాన రహదారులతో, మురుగు రోడ్ల వెంట నిలుస్తోం ది. దీంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. వాటిని చూస్తుంటే పురపాలికలో ఉన్నామో లేక మారుమూల గ్రామ పంచాయతీలో ఉన్నామో తెలియడం లేదు. పలు బస్తీల్లో 25 ఏళ్ల కిం దట వేసిన సీసీ రోడ్లు ఉన్నాయి. చిన్న వర్షం కురిసినా అవి బురదగా మారుతున్నాయి.

దీంతో పాదచారులు, వాహనదారులు ఇ బ్బంది పడుతున్నారు. స్వచ్ఛతపై అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నా... వసతులు మాత్రం కల్పించడం లేదు. ఈ మురుగుకు, అపరి శుభ్రతకు పలువురు కాలనీవాసులు కూడా కారణం అవుతున్నా రు. స్వచ్ఛ కార్మికులకు వ్యర్థాలు అందజేయాల్సి ఉండగా కొందరు మాత్రం వీధుల్లో పారేస్తూ.. అపరిశుభ్ర వాతావరణానికి కారణమ వుతున్నారు.

రోడ్లకు ఇరువైపులా ఉన్న ఖాళీ ప్రదేశాల్లో చెత్తాచెదా రం పడేస్తున్నారు. దీంతో దుర్వాసన, దోమల బెడద, పురపాలికలో పందులు, కుక్కలు, కోతుల బెడద నెలకొంది. ఈ సమస్య లతో నిత్యం ప్రజలు సతమతమవుతున్నారు. పురపాలిక సం ఘం అధికారులు ఇకనైనా పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించాలి. 

 శ్రీవిష్ణు, ఇబ్రహీంపట్నం