calender_icon.png 6 August, 2025 | 4:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ సిద్ధాంత దివిటీ

06-08-2025 12:41:50 AM

నేడు ప్రొ. జయశంకర్ సార్ జయంతి :

తెలంగాణ తొలిదశ ఉద్యమంలో ఉన్న లోటుపాట్లను సరిదిద్ది, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు రాజకీయ ప్రక్రియ ద్వారానే సాధ్యమవుతుందని మలిదశ ఉద్యమంలో ఉద్యమానికి భావప్రచారం అవసరమని భావించిన గొప్ప మేధావి. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదంతో నాలుగు కోట్ల మంది ప్రజల ను రగిలించిన ధీశాలి ఆచార్య కొత్తపల్లి జ యశంకర్. తెలంగాణ ప్రజానీకం అంతా ముద్దుగా జయశంకర్ సార్ అని పిలుచుకునే తెలంగాణ జాతిపిత జయంతి నేడు.

జయశంకర్ సార్ ఏనాడు కూడా తన గు రించి ఆలోచించుకోలేదు. తన ప్రాంతం గురించి మాత్రమే తపించారు. తన జీవితకాలం మొత్తం ఉహల్లో తేలిపోకుండా తన కలను సాకారం చేసే దిశగా మేధోమథనం చేసి.. సఫలీకృతం అయ్యారు. తనలో మొ దలైన ఆశ, మిత్రులు, శిష్యులతో పంచుకొ ని, తెలంగాణ వస్తే ఏమవుతుందో యావ త్ తెలంగాణ జాతికి వివరించారు. వారి లో భావ చైతన్యాన్ని కల్గించి, ఈ ప్రాంత ప్రజల దేవుడిగా మారిపోయారు.

అరు ద శాబ్దాలుగా ప్రజల మెదళ్లను తొలుస్తూ క దిలిస్తూ, ముందుకు నడిచినా గమ్యం చే రుకోలేకపోయిన ప్రత్యేక తెలంగాణ కలను సాకారం చేసి చూపిన ప్రజ్ఞాశాలి జయశంకర్ సార్. ఒక భాషకు ఒక రాష్ర్టం అన్న సూత్రీకరణతో జయశంకర్ సార్ విభేదించారు. ఒక భాషకు ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలు ఉన్నాయని, ఇక ముందు కూడా ఉండవచ్చని పేర్కొన్నారు. హిందీ భాష మాట్లాడే రాష్ట్రాలు ఎనిమిది ఉన్నప్పుడు, మరాఠీ, తెలుగు మాట్లాడే రాష్ట్రాలు రెండు, మూ డు ఉంటే తప్పేమిటి? అని ప్ర శ్నించారు.

ఎందుకంటే ఆయన లో తెలంగాణవాది మాత్రమే లేడు.. ఆయన చైతన్యం కల్గిన సామాజికవేత్త, ప్రాంతీయ అస్తి త్వం కాపాడడంతో పాటు, సా మాజిక సమీకరణలు చేయడం లో దిట్ట. 1996 మలిదశ ఉద్యమంలో జయశంకర్ సార్‌తో నాడు విద్యార్ధి నాయకునిగా భా వప్రచారంలో పాల్గొనే అవకా శం నాకు లభించింది.

భువనగి రి సభ ద్వారా తెలంగా ణ ప్రాం తంలోని ప్రజల బాధ లు, గాధలను ప్రపంచానికి తెలియజె ప్పారు. ప్రజాగాయకుడు యుద్ధనౌక గద్దర్ ‘అమ్మా తెలంగాణమా -ఆకలికేకల గానమా’ పాటతో భువనగిరి సభ దద్దరిల్లింది.. తద్వారా ప్రత్యేక తెలంగాణ కార్య క్రమాల మీద నాటి ప్రభుత్వం నిర్బంధం పెంచింది.

ప్రజాపోరాటంగా ఉద్యమం

మలిదశ ఉద్యమం ప్రజాపోరాటంగా రూపుదిద్దుకుంది. భువనగిరిలో ‘దగాపడ్డ తెలంగాణ’ అనే బ్యానర్‌తో సుదీర్ఘమైన సదస్సులో కవులు, కళాకారులు, పాత్రికేయులు, అధ్యాపకులు హాజరైన సందర్భం మరచిపోలేం. ఆచార్య జయశంకర్ సార్ తో ప్రయాణం అంటే మాములు ముచ్చ ట కాదు. నేను తెలంగాణ ఉద్యమకారుని గా, బతుకుదెరువు కోసం కారు నడుపుకుంటున్న ట్యాక్సీ డ్రైవర్‌గా దగ్గరి నుంచి సార్‌ని చూసినవాడిని.

2001లో తెలంగాణ ఉద్యోగ సంఘం, 2004లో తెలం గాణ విద్యావంతుల వేదిక ఏర్పాటయిన తర్వాత వారిని అనేక సభలకు తోలుకుపోయిన అనుభవాలు ఉన్నాయి. తెలంగాణ పదం ఉన్న ఏ వేదికకు కూడా ఆచార్య జ యశంకర్ సార్ వెళ్లేందుకు నిరాకరించేవాడు కాదు. విద్యార్థులు ఏర్పాటు చేసుకు న్న సభలు కానీ, ఉద్యోగులు ఏర్పాటు చే సుకున్న సభలు కానీ, విద్యావంతుల వేదిక  ఏర్పాటు చేసిన సభల్లో విస్తృతంగా పాల్గొనేవారు.

ఈ సభల్లో పాల్గొనడమే కాదు ఉ త్తేజభరితంగా ప్రసంగాలు చేయడం సార్ కు కొట్టిన పిండి. తెలంగాణ ఉద్యమకారుడు బియ్యాల జనార్ధన్ రావు, ఆచార్య జయశంకర్ సార్ మాత్రమే తెలంగాణ లిపిలో అందరికీ అర్థం అయ్యే విధంగా ప్రసంగాలు చేసేవారు. సార్ కలలు కన్నట్లుగానే నాడు కలకుంట్ల చంద్రశేఖర్ రావు తెలుగుదేశం నుంచి బయటకు వచ్చి తెలంగాణ రాష్ర్ట సమితి ఏర్పాటు చేశారు. దీం తో జయశంకర్ సార్ మస్తు సంబురపడ్డా రు. 

తెలంగాణ నినాదం కేవలం గ్రామా లు, జిల్లా కేంద్రాలకే పరిమితం అవుతుందని.. మన నినాదాన్ని చట్టసభల్లో విని పించే నాధుడు లేకుండా పోయారని సార్ ఎప్పుడూ బాధపడుతుండే వారు. పార్టీ ఏ దైనా, మనిషి ఎసొంటోడైనా రావు సాబ్ తో తెలంగాణ సాధిస్తామని అనేక చోట్ల చి ట్ చాట్ చేసిన సందర్భాలు మరచిపోలే ము.

ఇంతలోనే 2002లో జనార్దన్ సార్ ఆకస్మిక మరణం, భావవ్యాప్తి చేయడంలో జోడెడ్ల లాగా కదిలిన తన కాడి వి రగడం జరిగిపోయిం ది. అయినా సార్ కుంగిపోలేదు. లక్ష్యం చేరేందుకు కొత్తగా పార్టీ స్థాపించిన కేసీఆర్‌తో మమేకం అయ్యి నడిపించే నాయకుడు అయ్యారు. తెలంగాణ సిద్ధాంతకర్తగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు.

ఉప్పెనలా మలిదశ ఉద్యమం

మలిదశ తెలంగాణ ఉద్యమం ఉప్పెనలా సాగింది. డిసెంబర్ 9న చేసిన ప్రకటన మీద ఆంధ్ర పెత్తందారుల ఒత్తిడివల్ల తలొగ్గిన కాంగ్రె స్ పెద్దలు యూటర్న్ తీసుకున్నా రు. దీంతో తెలంగాణవ్యాప్తంగా భీ కరమైన పరిస్థితులు నెలకొని అనే క అనర్థాలకు దారితీశాయి. తదుపరి ఏర్పాటయిన శ్రీకృష్ణ కమిటీ  ముందు జయశంకర్ సార్ తన వాదనను అద్భుతంగా వినిపించారు.

ఒకానొక సందర్భం లో జస్టిస్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా జయశంకర్ సార్ కష్టపడి ‘ఎకనామిక్ వయోబిలిటీ ఆఫ్ ఆంధ్ర అండ్ తెలంగాణ యాజ్ సెపరేట్ స్టేట్స్’ అనే శీర్షికతో నివేదికను సమర్పించారు. ఈ నివేదికతో అయనలో ఉన్న ఆర్థికవేత్త ప్రస్ఫూటంగా బయటపడినారు. అప్పటికీ ఆరోగ్యం సహకరించకపోయినా అనేక సభల్లో పాల్గొన్నా రు. తెలంగాణ రాష్ర్టం ఏర్పడితే అభివృద్ధి చెందడానికి కావాల్సినన్నీ ప్రకృతి వనరు లు, మానవ వనరులున్నాయని అయన చెప్పేవారు.

గోదావరి, కృష్ణా నదుల మ ధ్య కొండలు, గుట్టలున్న తెలంగాణ అపారమైన జలవనరులను కల్గిన ప్రాంతం క నుక రాష్ర్టం ఏర్పాటయితే రాజకీయ నిర్ణయాధికారం ప్రజలకు దక్కుతుందని కల లు కన్నారు. అందుకే ముల్కీ నిబంధనల ను, 610 జీవోను పదే పదే, ప్రస్తావిస్తూ తన వాదాన్ని నినాదంగా మలిచారు. రా ష్ర్టం విడిపోతే వచ్చే నీటి పంపకాలపై కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలని అప్పుడే ఆంధ్ర, తెలంగాణ సస్యశ్యామలం గా ఉంటాయని దా నికి ఇరు రాష్ట్రాలు స హకరించుకోవాలని సూచించారు.

ఇన్నా ళ్లు అసాధ్యమనుకున్న అభివృద్ధి హైదరాబాద్ కేంద్రంగా ఉత్తర, దక్షిణ భారతాన్ని  అనుసంధానం చేస్తుందని, దేశంలో ఐదో అతిపెద్ద నగరంగా తీర్చిదిద్దుకోవచ్చని, రా జకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో ఉన్న లోటుపాట్లపై సార్ ప్రసంగం ఉండేది. వి ద్య, ఉద్యోగ రంగాలు ఉద్యమానికి మూలస్తంభాలుగా భావించారు. జయశంకర్   లేకుండానే తెలంగాణ ఆవిర్భావ సంబురాలు జరిగాయి.  

సార్ లేకపోవడం వల్లే బీసీలకు అన్యాయం

జయశంకర్ సార్ లేకపోవడంతో బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించే దిక్కు లేకుండా పోయింది. సాగు నీటి రం గంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని పూసగుచ్చినట్టు చెప్పిన తెలంగాణ పెద్దదిక్కును కోల్పోయి కృష్ణా, గోదావరి నీళ్ల పంచాయతీ ఇప్పటికీ తెగకుండా కేంద్ర ప్ర భుత్వం తమాషా చూస్తున్నది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించేందుకు చూస్తున్నా కానీ కేం ద్రంలోని పార్టీలు పెద్దగా సహకరించడం లేదు.

దీంతో బీసీల రిజర్వేషన్ల ఆంశం ఎ క్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందం గా తయారైంది. జయశంకర్ సార్ మన మధ్య లేకపోయినా తెలంగాణ సమాజం మాత్రం జయశంకర్ సార్‌ను ఎప్పటికీ గు ర్తుంచుకుంటూనే ఉంటుంది. తెలంగాణ ప్రజలు నిరాశ, నిస్పృహల్లో ఉన్న సమయంలో ప్రత్యేక ఉద్యమానికి ఊపిరులూ దిన సారు తెలంగాణ సాధించేలా చేశారు. సార్ కలలు కన్న తెలంగాణను చూడకుండానే మన మధ్య నుంచి వెళ్లిపోయారు. ఆ మహనీయుడి ఆశయాలను నేటితరం యువత కొనసాగించాలి.

డాక్టర్ సంగని మల్లేశ్వర్

వ్యాసకర్త సెల్- 9866255355