07-08-2025 12:45:49 AM
ఆదిలాబాద్ జిల్లాలోని నార్నూర్ ఉమ్మడి మండలం ఏజెన్సీ ప్రాంతంలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం మండల కేంద్రంలో సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించింది. ఈ ఆరోగ్యకేంద్రంలో కొత్త సిబ్బందిని కూడా భర్తీ చేస్తామని నాయకులు, అధికారులు ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు.
వాగులు, వం కల మధ్య రహదారులు సరిగా లేక, అరకొర సిబ్బందితో గర్భిణు లు, బాలింతలు, చిన్నారులు వివిధ వ్యాధులతో మృతి చెందు తున్నారని.. 20 20 సెప్టెంబర్‌లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం మండల కేంద్రంలో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల ఆస్పత్రిగా మార్చింది.
ఇందులో ఓ వైద్యాధికారి ఇద్దరు స్టాఫ్ నర్సు లు, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్టు మాత్రమే సేవలందిస్తున్నారు. గాదిగూడ, నార్నూర్ మారుమూల గ్రామాల నుంచి చికిత్స నిమి త్తం వచ్చినా చూసేవారు లేక, ఉట్నూర్, ఆదిలాబాద్ ప్రభుత్వ ఆ స్పత్రులకు వెళ్తున్నారు. నాయకులు, అధికారులు నార్నూర్ సీహెచ్‌సీకి సిబ్బందిని కేటాయించి రోగుల ఇబ్బందులు తప్పించాలి.
మురళీనాయక్, నార్నూర్