calender_icon.png 23 September, 2025 | 9:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీతాలు ఇవ్వకపోతే ఎలా?

27-06-2024 12:00:00 AM

బ్రాహ్మణ పరిషత్‌పై కాంగ్రెస్ శీతకన్ను వేయడం అన్యాయం. అక్కడి ఉద్యోగులకు మూడు  నాలుగు నెలలుగా జీతాలు కూడా లేవంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గత పార్టీ పథకాలన్నీ బంద్ చేయాలనుకోవడం ప్రజాపాలన ఎలా అవుతుంది? పథకాలవల్ల లబ్ధి పొందుతున్నది ప్రజలేకానీ, ఆయా పార్టీల కార్యకర్తలు కాదుగా! విదేశీ విద్యాపథకం కింద ఇప్పటికే కొంత ప్రభుత్వ సహాయం పొంది, మిగిలిన సహాయం కోసం ఎదురు చూసేవారికి, పథకాలలో ఆర్థిక సహాయం మంజూరైన వారికి నిధులు నిలిపేయడం దారుణం.

రామనాథాచార్యులు ఎస్. కరీంనగర్