కోహ్లీ, స్మిత్ కీలకం
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీపై స్పందించిన మాజీ ఆసీస్ ప్లేయర్
ముంబై: భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియన్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఇద్దరూ రాబోయే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తమ ముద్ర వేస్తారని ఆసీస్ మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్ అభిప్రాయపడ్డాడు. సీయట్ క్రికెట్ రేటింగ్స్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న హేడెన్ మాట్లాడుతూ.. ‘కోహ్లీ, స్మిత్ ఇద్దరూ బీసీజీలో కీలకం అవుతారు. వారిద్దరూ ప్రతి విషయాన్ని కొత్త మార్గంలో చేసి చూపిస్తారు.
ఇద్దరి స్టుల్ ఇతరులతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది.’ అని హేడెన్ అన్నాడు. ఇండియా మధ్య చాలా కాలం నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరుగుతోంది. ఈ సంవత్సరం పెర్త్ వేదికగా నవంబర్ 22 నుంచి ఈ సిరీస్ మొదలు కానుంది. చివరగా 2014 సంవత్సరంలో ఆసీస్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలుచుకుంది. తర్వాత నాలుగు పర్యాయాలు ఇండియానే విజయం సాధించింది. ఈ సారి ఎలాగైనా విజయం సాధించాలని ఆసీస్ ఉవ్విళ్లూరుతోంది.






