9 May, 2026 | 1:53 AM

బీఆర్‌ఎస్ బంద్‌కు, కరీంనగర్ ప్రజలకు సంబంధం ఏమిటి?

09-05-2026 12:48 AM

కరీంనగర్, మే8(విజయక్రాంతి):బీఆర్‌ఎస్ బంద్ కు, కరీంనగర్ ప్రజలకు సంబంధంహ్ ఏమిటనిడిప్యూటీ మేయర్, బి జె పి అధికార ప్రతినిధి వై. సునీల్ రావు ప్రశ్నించారు. శుక్రవారం పార్టీ కార్పొరేటర్ల తో కలసి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూబీఆర్‌ఎస్ బంద్ ను అడ్డుకుని తీరతాంప్రజాశ్రేయస్సులేని బీఆర్‌ఎస్ బంద్ కు ప్రజలెవరూ సహకరించవద్దని విజ్ఝప్తి చేస్తున్నాబీజేపీ కార్పోరేటర్లందరం కలిసి తమ తమ డివిజన్లలోని వ్యాపార కూడళ్లపై వచ్చి వ్యాపారులు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే వాతావరణం కల్పిస్తాం బలవంతంగా బంద్ చేయించాలనే వారిని అడ్డుకుంటాం.బీఆర్‌ఎస్ బంద్ కు ఎవరూ భయపడాల్సిన పనిలేదని సామా న్యులకు, వ్యాపారులకు అండగా బీజేపీ ఉందన్నారు.

కరీంనగర్ లోని ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టాలని చూస్తే ఖబడ్డార్ అని హెచ్చరించారు.*రేపటి బీఆర్‌ఎస్ బంద్ ను అడ్డుకోవడానికి బీజేపీ కార్యకర్తలంతా రోడ్లపైకి రావాలనిబంద్ పేరుతో అరాచకాలు స్రుష్టించాలనుకునే బీఆర్‌ఎస్ ఆగడాలను అడ్డుకుందామన్నారు.బి ఆర్ ఎస్ బంద్ పిలుపులో ప్రజా శ్రేయస్సు ఎక్కడుందన్నారు.ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై దాడి చేయడం బీజేపీ కార్యకర్తల ఉద్దేశం కానేకాదనికేంద్ర మంత్రి బండి సంజయ్ ఇప్పటికే ఈ విషయాన్ని స్పష్టం చేశారన్నారు.

ప్రభుత్వ నిధులతో కట్టిన క్యాంప్ ఆఫీసులో అభివ్రుద్ధి గురించి మాట్లాడాలి కానీఅందుకు భిన్నంగా బూతులు తిడుతూ వ్యక్తిత్వ హననం చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నారు.ప్రభుత్వ పైసలతో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుల్లో నియోజకవర్గ అభివ్రుద్ధి, ప్రజా సమస్యలపై మాట్లాడాలే తప్ప కేంద్ర మంత్రి అనే గౌరవం లేకుండా అసభ్య పదజాలంతో నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతూ నీచ రాజకీయాలు చేస్తారా అని ధ్వజమెత్తారు.బీజేపీ కార్యకర్తల, కరీంనగర్ ప్రజల మంచి తనాన్ని, సహనాన్ని చేతగాని తనంగా చూస్తూ ఊరుకోవాలా అన్నారు.

అసలు ఈ వివాదానికి మూల కారకుడు కేటీఆర్ కాదా అన్నారు.కాందిశీకుల భూముల వ్యవహారంలో సీఎంతో, బండి సంజయ్ కుమ్కక్కయ్యారని, ఆధారాలను బయటపెడతామని అడ్డగోలు ఆరోపణలు చేసింది కేటీఆర్ కాదా అన్నారు.48 గంటల్లో ఆ ఆధారాలను బయటపెట్టాలని డిమాండ్ చేస్తే తోకముడించింది కేటీఆర్ కాదా అన్నారు.ఆధారాల్లేకపోవడంతో ప్రజల ద్రుష్టిని దారి మళ్లించేందుకు బీఆర్‌ఎస్ చెంచాలతో బూతులు తిట్టిస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోంది కేటీఆర్ అని,*అసలు తెలంగాణలో దాడుల సంస్క్రుతికి తెరలేపింది బీఆర్‌ఎస్ అని అన్నారు.

ప్రజా సంగ్రామ యాత్రపై రాళ్ల దాడి చేయించిన నీచ సంస్క్రుతి కేసీఆర్, కేటీఆర్ లదనిప్రజాసంగ్రామ యాత్రలో పాల్గొన్న కరీంనగర్ బీజేపీ కార్యకర్తల తలలు పగలకొట్టి, అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిన చరిత్రను మర్చిపోయారా అన్నారు.వడ్ల కొనుగోలు కేంద్రాల పరిశీలనకు వెళ్లినప్పుడు బండి సంజయ్ కాన్వాయ్ పై రాళ్ల దాడి చేసి 18 వాహనాలను ధ్వంసం చేసి, ఎంతో మంది అమాయకుల కాళ్లు, చేతులు విరగ్గొట్టిన నీచ చరిత్ర బీఆర్‌ఎస్ ది అన్నారు.

ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్న బండి సంజయ్ ని బెదిరించి, భయపెట్టడానికి అడుగుడుగునా ఆటంకాలు కల్పిస్తూ దాడులు, అరెస్టులు, కేసులో అరాచకాలు స్రుష్టించిన ఘటనలను మర్చిపోయారా అన్నారు.సిరిసిల్లకు కేటీఆర్ వచ్చినప్పుడల్లా బీజేపీ, ఏబీవీపీ కార్యకర్తలపై లాఠీలు ఝుళిపించి కేసులు పెట్టిన దుర్మార్గులు మీరు కాద అని ధ్వజమెత్తారు.