11 August, 2026 | 1:12 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •   తమిళనాడు అసెంబ్లీలో నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం   •  

స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు..?

19-06-2025 04:35 PM

రిజర్వేషన్లు ఎలా ఉంటాయి..? 

ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఆశావాహులు..

వలిగొండ (విజయక్రాంతి): గత కొన్ని నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇదిగో, అదిగో అన్నట్లు రాజకీయ ఆశావాహులను ఊరిస్తూ ఉండడంతో తాజాగా మంత్రుల ప్రకటనలు, సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలంటూ పిలుపునివ్వడంతో ఆశావాహులు స్థానిక సంస్థలు ఎప్పుడు వస్తాయని రిజర్వేషన్లు ఎలా ఉండనున్నాయని అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలైనా సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీలు సంవత్సరం పైగా నిర్వహించకపోవడంతో అటు కేంద్ర ప్రభుత్వం  ఇటు రాష్ట్ర ప్రభుత్వం నిధులు లేక గ్రామాల్లో పాలన కుంటుపడింది.

అయితే గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ మంత్రులు స్థానిక సంస్థల ఎన్నికలు జూలైలో నిర్వహించే అవకాశం ఉందని తెలియజేయడం, సీఎం రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ శ్రేణులతో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా రైతులందరికీ రైతు భరోసాను కూడా అందించడంతో నూతన రేషన్ కార్డులను అందించడం వేగంగా కొనసాగుతూ ఉండడంతో స్థానిక సంస్థల ఎన్నికలు కచ్చితంగా వచ్చే అవకాశం ఉందని దీంతో గ్రామాల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పిటిసి పదవుల కోసం పోటీపడే అన్ని పార్టీల ఆశావాహులు అందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా గ్రామాల్లో ఎక్కడ చూసినా రచ్చబండల వద్ద స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని రిజర్వేషన్లు పాత పద్ధతిలోన, కొత్త పద్ధతిలోన అని చర్చించుకోవడం కనిపిస్తుంది.