4 June, 2026 | 3:20 AM

బీసీ రాజ్యాధికారం వచ్చేదేప్పుడు?

04-06-2026 02:36 AM

బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ సూటి ప్రశ్న... 

ఆదిలాబాద్, జూన్ 3 (విజయక్రాంతి) : ప్రత్యేక రాష్ట్రంలో అందరికంటే ఎక్కువగా నష్టపోయింది బీసీ వర్గాలేనని... ఉమ్మడి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే.. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక 18 శాతానికి తగ్గిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అటు 2034 వరకు ముఖ్యమంత్రి తానేనని రేవంత్ రెడ్డి ప్రకటించుకోవడం... అటు బీఆర్‌ఎస్ నేతలు కేసీఆర్ యే రాబోయే ముఖ్యమంత్రి అంటూ ప్రకటించుకుంటూ పోతే ఇక బీసీ లకు రాజ్యాధికారం దక్కేదెప్పుడని ప్రశ్నించారు.

ఆదిలాబాద్ లో జరిగిన సంఘం జెండా పండుగ కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం  జిల్లాకు వచ్చిన ఆయన తొలుత బీసీ సంఘ భవనం ఎదుట జెండాను ఆవిష్కరించారు.అనంతరం స్థానిక టీఎన్జీఓ భవనంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ .... తెలంగాణ ఆవిర్భావ ది నోత్సవం రోజున ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వాఖ్యలు తెలుగు రా ష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయన్నారు.రాజకీయ నాయకుల త్యాగాలతో ప్రత్యేక రాష్ట్రం రాలేదని... 1200 మంది బడుగుబలహిన వర్గాల బలిదానాలతో ప్రత్యేక రాష్ట్రం సాకారమైందని, అయిన  బీసీ లకు ఒరిగిందేమీ లేదన్నారు.