4 June, 2026 | 3:10 AM

రాయితీపై జీలుగు విత్తనాల పంపిణీ ప్రారంభం

04-06-2026 02:36 AM

కోదాడ జాన్3: కోదాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో బుధవారం రైతులకు రాయితీపై జీలుగు విత్తనాలను పంపిణీ చేశారు. పీఏసీఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి రైతులకు విత్తన బస్తాలను అందజేసి మాట్లాడారు. వానాకాలం సీజన్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో పచ్చిరొట్ట ఎరువుగా ఉపయోగపడే జీలుగు విత్తనాలను ప్రభుత్వం 50 శాతం సబ్సిడీతో అందిస్తోందన్నారు. 30 కేజీల బస్తాకు రాయితీ పోగా రైతులు తమ వాటా కింద రూ. 2452 చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. విత్తనాలు కావలసిన రైతులు తమ ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ప్రతులను వ్యవసాయ అధికారులతో ధ్రువీకరించుకొని తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ లు పిచ్చయ్య, నగేష్, పిఎసిఎస్ సీఈఓ మంద వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.