30 May, 2026 | 1:50 AM

అపర సంగీత వరప్రదాయిని నందిని

30-05-2026 12:00 AM

సికింద్రాబాద్, మే29 (విజయ క్రాంతి):  కర్ణాటక శాస్త్రీయ సంగీతానికి  సరిహద్దులు ఉండవని , స్వరమే మాతృభాష అని మరోసారి నిరూపించారు ప్రముఖ విద్యాంసురాలు డాక్టర్ ఎన్.జె.నందిని. సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలోని  మీనాక్షి సుందరం హాల్లో గురువారం సాయంత్రం జరిగిన సంగీత కచ్చేరి.. గ్రీష్మ తాపంలో ఉన్న నగర శ్రోతలపై శిశిరపు వెన్నెల కురిపించినట్లు సాగింది. చంద్రశేఖర్ శివరామన్ నేతృత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఆద్యంతం అలౌకిక అనుభూతిని పంచింది. మాతృభాష తెలుగు కాకపోయినా, వాగ్గేయకారుల భావాన్ని ఆకళింపు చేసుకుని త్యాగరాజ కీర్తనలను ఆమె పలికించిన తీరు రసజ్ఞులను అబ్బురపరిచింది.ఇంతటి ఘనమైన సంగీత ఉత్సవాన్ని నగర శ్రోతలకు అందించిన  చంద్రశేఖర్ శివరామన్ను సంగీత అభిమానులు ప్రత్యేకంగా అభినందించారు.