ఏడాది దాటినా మోక్షమేది?
- ఎన్నికల హామీగా మారిన రేకుర్తి వాసుల సమస్య
- సర్వే నంబర్ 240.. 536 ఎకరాలు నిషేధిత జాబితాలోకి..
- ఏడాది గా బాధితుల ఆందోళన బాట
కరీంనగర్, ఆగస్టు5(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం, ప్రస్తు తం కార్పొరేషన్ పరిధిలోని రేకుర్తి 240 స ర్వే నంబర్లలోని భూములను, దాదాపు 536 ఎకరాలను రెవెన్యూ అధికారులు నిషేధిత జాబితా (సెక్షన్ 22-ఏ)లో చేర్చి ఏడాది దా టింది. మోక్షం లభించకపోవడంతో ఆందోళన బాట పట్టారు రేకుర్తి, విద్యానగర్, సీతా రాంపూర్ వాసులు . నగరపాలక సంస్థ ఎన్నికల సమయంలో నిషేధిత కాబితా నుం డి తొలగోయించకుంటే అసెంబ్లీ వరకు పాదయాత్ర చేస్తానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రకటించారు. కేంద్రమంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తామన్నారు. నేటికి నిషేధిత జాబిటలోనే కొనసాగుతుండటం ఈ ప్రాంత వాసులను ఆందోళన కలిగిస్తున్న అంశం.
నిషేధిత జాబితాలో చేర్చడంవల్ల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి వేలాది మంది ఇళ్ల యజమానులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రేకుర్తి పరిధిలో సుమారు 3,000 ఇళ్లు, 5,000 ఖాళీ ప్లాట్లు ఉన్నాయి. రైతులు ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పట్టా భూము లు నిషేధిత జాబితాలోకి వెళ్లాయి.గంగాధర సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో ఈ సర్వే నంబర్లపై అమ్మకాలు, కొనుగోళ్లు, ఇతర లావాదేవీలు నిలిచిపోయాయి. ఇవి ప్రభుత్వానికి, ల్యాండ్ సీలింగ్ , అసైన్డ్ కిందకు వచ్చే భూములని అధికారులు చెబుతున్నారు. సరైన విచారణ జరపకుండా, తమ ప్రమేయం లేకుండానే పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చారంటూ బాధితులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
రేకుర్తి భూములను నిషేధిత జాబితా (22-ఏ) నుండి తొలగించాలి
దశాబ్దాలుగా సాగులో ఉన్న పట్టా భూములను అకస్మాత్తుగా అసైన్డ్ భూములుగా పేర్కొంటూ నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీనివల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చట్టవిరుద్ధంగా చేర్చిన ఉత్తర్వులను రద్దు చేసి, వెంటనే విచారణ జరిపి రైతులకు, స్థానికులకు న్యాయం చేయాలి. ప్రభుత్వం స్పందించకుంటే 10 వేల మందితో కలెక్టరేటముట్టడిస్తాం-.
పాశం మోహన్ రెడ్డి,ఐక్యవేదిక నాయకులు
ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళనే
ప్రభుత్వం సానుకూలంగా స్పందించి రేకుర్తి సమస్యను పరిష్కరించకపోతే ఆందోళన బాట పడుతాం. ఈ భూ వివాదం పేద, మధ్యతరగతి వర్గాల పైనే కాకుండా కరీంనగర్ రియల్ ఎస్టేట్ రంగంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతోంది. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి.. ఎల్‌ఆర్‌ఎస్ లేదా ఇతర మార్గాల ద్వారా ఈ భూములను క్రమబద్ధీకరించాలని కోరుతున్నాము.
సూదగొని మాధవి కృష్ణ గౌడ్ , 19వ డివిజన్ కార్పొరేటర్






