5 March, 2026 | 5:40 AM

హోలీ సంబరాల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన విప్ ఆది

05-03-2026 12:49 AM

వేములవాడ, మార్చి 4,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ పట్టణం లో నిర్వహించిన హోలీ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మె ల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. మున్సిపల్ పాల కవర్గం సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి రంగులు పూస్తూ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోలీ పండుగ ఐక్యత, సౌభ్రాతృత్వానికి ప్రతీక అని అన్నారు. చెడుపై మేలుకు గెలుపును సూచించే ఈ పండుగను కులమత భేదాలు లేకుండా అందరూ ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. ప్రజలు సురక్షితంగా, పర్యావరణహితంగా హోలీ వేడుకలు నిర్వహించాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు.