సొంత ఖర్చుతో ఎల్లమ్మ ఆలయ నిర్మాణం
ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాకులమర్రి లక్ష్మణ్ బాబు
ఏటూరునాగారం, మార్చి4 (విజయక్రాంతి): రాజకీయాల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఏటూరునాగారం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కాకులమర్రి శ్రీలత మరియు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు ఆదర్శంగా నిలిచారు.సర్పంచ్ ఎన్నికల సమయంలో తాము గెలిచిన తర్వాత గ్రామంలోని రామాలయం వద్ద వెలసిన పుట్ట రూపంలో వెలసిన ఎల్లమ్మ తల్లికి గుడి కట్టిస్తామని వారు ప్రజలకు అమ్మవారికి మాట ఇచ్చారు.ఆ మాటను తూచా తప్పకుండా పాటిస్తూ నేడు ఆ ఎల్లమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి సర్పంచ్ దంపతులు ఘనంగా శంకుస్థాపన చేయించారు.
సొంత ఖర్చుతో నిర్మాణం ఎవరిపైనా భారం పడకుండా, చందాల జోలికి వెళ్లకుండా.. వారే స్వయంగా ఒప్పుకున్న ప్రకారం తమ సొంత నిధులతో ఈ ఆలయ నిర్మాణాన్ని చేపడుతున్నారు. భక్తిశ్రద్ధలతో భూమి పూజ: రామాలయం వద్ద ‘ పుట్ట రూపంలో వెలసిన‘ అమ్మవారికి భవ్యమైన ఆలయం నిర్మించాలని నిర్ణయించి, శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు.ఈ సందర్భంగా కాకులమర్రి లక్ష్మణ్ బాబు-శ్రీలత దంపతులు మాట్లాడుతూ ‘ఎన్నికల సమయంలో మేము అమ్మవారికి, ప్రజలకు ఒక మాట ఇచ్చాము. ఆ మాట ప్రకారం ఈరోజు గుడి కట్టించే భాగ్యం మాకు కలగడం సంతోషంగా ఉంది. మా సొంత కృషితోనే ఈ ఆలయాన్ని పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తెస్తాము‘ అని ధీమా వ్యక్తం చేశారు.




