14 July, 2026 | 4:55 PM

Breaking News

20లోగా ఓటర్ల సవరణ పూర్తి చేయాలి: కలెక్టర్ రాహుల్ శర్మ   •   ఓటరు సర్ లో పాల్గొన్న నగర మేయర్ కొలగాని   •   ప్రతి ఒక్కరు SIR ప్రక్రియను సద్వినియోగించుకోవాలి   •   రక్తాన్ని పొలాల్లో చల్లి రైతుల నిరసన   •   పెండింగ్ స్కాలర్‌షిప్‌లపై ఆందోళనకు ముందస్తు అరెస్టులు   •   వరికి ప్రత్యామ్నాయంగా రైతులు అపరాలు పండించాలి: ఏఓ చంద్రశేఖర్ రెడ్డి   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో 100% పూర్తి చేయాలి: ఎస్ఐఆర్ నియోజకవర్గ ఇన్చార్జి.   •   డిగ్రీ కళాశాల వద్ద శాశ్వత బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి   •   కుకునూరుపల్లి ఫోటోగ్రాఫర్ యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఒక్క ఓటరు నష్టపోవద్దు   •  

రాంగ్‌రూట్‌లో వెళ్లే వాహనదారులపై కొరడా

24-06-2024 03:02 AM
  • ఒకే రోజు 114 వాహనాలను పట్టుకున్న పోలీసులు 
  • 22 ఎఫ్‌ఐఆర్‌ల నమోదు

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 23 (విజయక్రాంతి) : సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ నిబంధనలను పోలీసులు పక్కాగా అమలు చేస్తున్నారు. గతకొద్ది రోజులుగా రాంగ్‌రూట్‌లో ప్రయాణాలు చేసే వాహనదారులపై కొరడా ఝుళిపిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం సైబరాబాద్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. రాంగ్ రూట్‌లో వెళ్లే వారిపై ఇన్నాళ్లు కేవలం ఎంవీ(మోటార్ వెహికిల్) యాక్ట్ కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. ప్రస్తుతం లా అండ్ ఆర్డర్ ప్రకారం కేసు లు నమోదు చేస్తున్నారు.

నిబంధనలకు ఉల్లంఘించిన వారిని ఏకంగా కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలిస్తున్నారు. శనివారం ఒక్కరోజే రాంగ్‌సైడ్ లో ప్రయాణిస్తున్న 114 వాహనాలను పట్టుకుని 22 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఇప్పటి వరకు రాంగ్‌రూట్‌పై జరిపిన స్పెషల్ డ్రైవ్‌లో 631 వాహనాలను పట్టుకొని 122 ఎఫ్‌ఐఆర్‌లు నమో దు చేసినట్లు తెలిపారు. ఇకపై రాంగ్‌రూట్‌లో వాహనాలు నడిపితే ఉపేక్షించేంది లేదని, జైలుకు వెళ్లడం ఖాయమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.