15 August, 2026 | 4:54 AM

రోజమ్మ రొయ్యల పులుసుతిని 4 టీఎంసీల నుంచి 10 టీఎంసీలకు పెంచింది ఎవరు

15-08-2026 12:00 AM
  1. వనపర్తి నియోజకవర్గంలో 87 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చింది కాంగ్రెస్ 
  2. కేటీఆర్ సిరిసిల్ల ఎమ్మెల్యే, నేను వనపర్తి ఎమ్మెల్యే తేడా ఏంటి 
  3. ఎన్నికల ముందు ఒక పంపు ఆన్‌చేసి హైదరాబాద్‌కు వెళ్లేవరకు ఆగిపోయింది : ఎమ్మెల్యే మేఘరెడ్డి 

వనపర్తి, అగస్టు 14 (విజయక్రాంతి) : రోజమ్మ రొయ్యల పులుసు తిని రోజులు 4 టి ఎం సి లు ఉన్న పోతిరెడ్డి పాడు కాలువను 10 టి ఎం సి ల నీళ్లు తీసుకుని వెళ్లేలా చేసింది ఎవరన్నది తెలంగాణ ప్రజలందరికి తెలుసునని వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం లోని డిసిసి కార్యాలయం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత ఎం చేయాలో తెలియక విహార యాత్ర పేరిట ప్రాజెక్టు ల దగ్గరకు వెళుతు దావత్ లు చేసుకుంటున్నారని ఎమ్మెల్యే ఏద్దేవా చేశారు. దేశంలో రాష్ట్రములో జూరాల, శ్రీ శైలం, భీమా, నెట్టెం పాడు, కోయిల్ సాగర్ ఇలా ప్రతి ప్రాజెక్టు ను కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమన్నారు. 

పాలమూరు నాకు భిక్ష పెట్టింది అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని బి ఆర్ ఎస్ అధికారం లోకి వచ్చిందని 8 నెలల ముందు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కు శంకుస్థాపన చేసి పడావు పెట్టి 8 నెలల తరువాత కాళేశ్వరం కు శంకుస్థాపన చేసి ప్రాజెక్టు పూర్తి చేసి కూళేశ్వరం చేసారని ఎమ్మెల్యే వివరించారు. 

భీమా ఫేస్ 2 ఆన్ చేస్తున్నాం అని అధికారులతో తెలుసుకుని ప్రెస్ మీట్ పెట్టి మేము ప్రెస్ మీట్ పెట్టిన తరువాతనే నీళ్లు వస్తున్నాయని అంటున్నారని అగస్ట్ 1 న ఎల్లూర్, 2 న జొన్నలబొగడ, 3 న గుడిపల్లి కి నీళ్లు వచ్చాయాని 7 వ తేదీన ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు చెబితే నీళ్లు వస్తే 24 గంటల్లో 4 టిఎంసిల నీళ్లు వస్తాయని ఎమ్మెల్యే ప్రశ్నించారు.

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్యాకేజి 1,2,3,4 పూర్తి చేసి ముందుకు వెళ్ళాలి రైతులకు ల్యాండ్ అక్వేషన్ చేస్తే రైతులు కమిషన్ ఇవ్వరు కాబట్టి రిజర్వాయర్ కడితే కాంట్రాక్టర్ లు కమిషన్ ఇస్తారు కాబట్టి అవి పూర్తి చేసారని తమ ప్రభుత్వం వచ్చిన తరువాత 30 నెలల్లో 9 రివ్యూ లు పెట్టి ల్యాండ్ అక్వేషన్ పూర్తి చేస్తూ 5 వేల కోట్లు, పెండింగ్ లో ఉన్న 4 వేల కోట్లు బిల్లులను చెల్లించడం జరిగిందని ఎమ్మెల్యే వివరించారు.

2023 ఎన్నికల ముందు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు దగ్గర ఒక్క మోటారు ఆన్ చేసి జాతి కి అంకితం అని చెప్పి ఈ జలాలను తీసుకుని ప్రతి గ్రామం లో దేవుళ్ళకు పూజ చేయమని చెప్పి హైదరాబాద్ కు హెలికాప్టర్ లో వెళ్లే వరకు మోటారు ఆగిపోయిందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. పొడుగు పొడుగు మాటలు మాట్లాడుతున్న కె టి ఆర్ నీవు సిరిసిల్ల ఎమ్మెల్యే వి నేను వనపర్తి ఎమ్మెల్యే ను తేడా ఏంటన్నారు.  వనపర్తి నియోజకవర్గం లో తనని కూలోడు, పాలోడు, కాంట్రాక్టర్ అని ఏద్దెవా చేసారని తాను ప్రజల కోసం అన్నిటిని భరిస్తానన్నారు. 

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే 87 వేల ఎకరాలకు సాగునీరు

వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం లోనే 87 వేల ఎకరాలకు నీళ్లు వచ్చాయాని రికార్డ్ ప్రకారం చెబుతున్నానని ఎమ్మెల్యే అన్నారు. జూరాల ఎడమ కాలువ ద్వారా పెబ్బేరు, శ్రీ రంగా పురం లకు 26,056 ఎకరాలు, రాజీవ్ బీమా ప్యాకేజి 16 ద్వారా 3480 ఎకరాలు, ప్యాకేజి 19 ద్వారా 927 ఎకరాలు, ప్యాకేజి 27 ద్వారా 6617 ఎకరాలు, కె ఎల్ ఐ డి 5 ద్వారా 9259 ఎకరాలు వీటితో పాటు అదనంగా 5315 ఎకరాలు, డి 8 ద్వారా 10136 ఎకరాలు వీటితోపాటు అదనంగా 730 ఎకరాలు ఇలా మొత్తంగా 2014 ఎన్నికల ముందే వనపర్తి నియోజకవర్గంలో 87 వేల ఎకరాలకు ఆయకట్టు సాగునీరు ను వచ్చాయాని ఎమ్మెల్యే వివరించారు. 

కార్యకర్తలను ఎమన్నా వదిలేదు.... రాష్ట్ర స్పోరట్స్ అథారిటి చైర్మన్, డిసిసి అధ్యక్షులు శివసేనారెడ్డి 

ప్రతి పక్ష నాయకులు ఎమ్మెల్యే ను నాయకులను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఇట్లా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని కార్యకర్తలను ఒక్కమాట అన్న ఇకపై సాహించేది లేదని బదులుకు బదులు గట్టిగా ఉంటుందని రాష్ట్ర స్పోరట్స్ అథారిటి చైర్మన్, డిసిసి అధ్యక్షులు శివసేనారెడ్డి అన్నారు. ఈ సమావేశంలో మున్సి పాలిటీ ఛైర్ పర్సన్ మాధవి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ తదితర కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు