05-12-2024 12:00:00 AM
న్యూఢిల్లీ: బీసీసీఐ సెక్రటరీగా వ్యవహరించిన జై షా ఇటీవలే ఐసీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడంతో త ర్వాతి సెక్రటరీ ఎవరన్నది ఆసక్తికరంగా మారిం ది. గుజరాత్ క్రికెట్ సంఘం కార్యదర్శి అనిల్ పటేల్, బీసీసీఐ జాయింట్ సెక్రటరీ దేవ్‌జిత్ సైకియాతో పాటు ఢిల్లీ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు రోహన్ జైట్లీ పదవిపై ఆసక్తిగా ఉన్నట్లు వార్తలో వచ్చాయి.
బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం ఎన్నికైన ఆఫీస్ బేరర్ రాజీనామా చేసినట్లయితే 45 రోజుల్లోపూ బోర్డు ప్రత్యేక సాధారణ సమావేశం నిర్వహించి అతని స్థానంలో కొత్తవారిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. అయితే ఎన్నికల నిర్వహించడం కోసం కనీసం నాలుగు వారాల ముందు ఎన్నికల అధికారిని కూడా నియమించాల్సి ఉంటుంది.