29-12-2025 03:27:24 PM
సర్పంచ్ చిలుకల మంజుల వెంకన్న
తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట డిపో నుండి టీఎస్ఆర్టీసీ బస్సు సూర్యాపేట నుండి బయలుదేరి ఉదయం 8.30 గంటలకు గొట్టిపర్తి గ్రామానికి రావడం జరుగుతుంది. .మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు ఆదేశానుసారం మా గ్రామానికి బస్సు రావడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణం కోసం స్థల దాతఅయిన గుమ్మడవెల్లి సోమన్న పాలకేంద్ర దగ్గర ఉన్న స్థలాన్ని పరిశీలించినైనది.
ఈ రెండు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్థానిక సర్పంచ్ చిలుకల మంజుల వెంకన్న తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న. స్థానిక ఉపసర్పంచ్ అన్నేబోయినశ్రీకాంత్ మాజీ సర్పంచ్ వర్యులు గుమ్మడవెల్లి సోమన్న. చందా వెంకన్న .వార్డు సభ్యులు కోతి ఉమా యాకయ్య .యువజన నాయకులు కొండ సాయి మాదగాని రాజు గ్రామంలో ఉన్నటువంటి మహిళలు. యువజన నాయకులు. తదితరులు పాల్గొన్నారు.