calender_icon.png 29 December, 2025 | 4:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంటచెనులో నాటుబాంబు కలకలం

29-12-2025 03:20:32 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గర్గుల్ గ్రామంలో నాటు బాంబు పేలిన ఘటనలో ఓ కుక్క మృతిచెందగా ఈ ఘటన కలకలం రేపుతోంది. గ్రామస్తుల కథనం మేరకు.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మొగుళ్ల సాయాగౌడ్ కు చెందిన పంట చేనులో శనివారం ఉదయం సమయంలో సాయాగౌడ్ తమ్ముడు రామా గౌడ్ నీళ్లు పారించడానికి వెళ్ళాడు. ఆ సమయంలో భారీ శబ్దం రావడంతో వెళ్లి చూడగా ఓ కుక్క తల పగిలి మృతి చెందింది.

చుట్టుపక్కల చూడగా పొగ రావడాన్ని గమనించగా నాటు బాంబులు పేలినట్టు గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు తమ పంట చేనులో బాంబులు పడేసి ఉండటంతో అది తెలియని కుక్క నోట పట్టుకోవడంతో తలపగిలి మృతి చెంది ఉన్నట్లు అనుమానిస్తున్నారు. తమకు హాని చేయడానికే బాంబులు పడేసి ఉంటారని బాధిత పంట చేను రైతు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ చేనులో బాంబులు పడేసి తమకు హాని కలిగించాలని ప్రయత్నించిన గుర్తు తెలియని వ్యక్తుల పై కఠిన చర్యలు తీసుకోవాలని సాయాగౌడ్ తో పాటు చుట్టుపక్కల రైతులు కోరుతున్నారు. కాగా పేలుడు ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ జరుపుతున్నారు. అడవి పందుల కోసం ఎవరైనా పెట్టి ఉంటారా.. ? లేదా కావాలని పెట్టారా అనేది పోలీసుల విచారణలో తేలనుంది.