calender_icon.png 12 November, 2025 | 5:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరీంనగర్ డీసీసీ పీఠం దక్కేదెవరికో?

11-09-2024 02:32:00 AM

కరీంనగర్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి ): కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అ ధ్యక్షు డి ఎన్నికపై ఉత్కంఠత నెలకొంది. ఉమ్మడి జిల్లాకు కరీంనగర్ కేంద్రం కావడం, పార్టీకి సొంత కార్యాలయంతోపాటు ఆర్థిక వనరు లు సమకూర్చే ఫంక్షన్‌హాల్ ఉండటం తో నే తల్లో పోటీ నెలకొంది. త్వరలో నూతన అధ్య క్షుడి నియామకం జరిగే అవకాశం ఉండటంతో పదవిని ఆశిస్తున్న నేతలంతా పీసీసీ నూతన అధ్యక్షుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. 

పత్తి కృష్ణారెడ్డి ప్రయత్నాలు

హుజూరాబాద్‌కు చెందిన కాంగ్రెస్ కిసాన్‌సెల్ అధ్యక్షుడు పత్తి కృష్ణారెడ్డి డీసీసీ పదవిపై ఆశలు పెంచుకున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో టికెట్ ఆశి ంచగా అధిష్టానం బల్మూరి వెంకట్‌కు అవకాశమిచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ కృష్ణా రెడ్డికి దక్కలేదు. డీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే పా ర్టీని మరింత బలోపేతం చేయడాలనిక సిద్ధంగా ఉన్నట్లు నేతలకు విన్నవించుకుంటున్నారు. 

పొన్నం అనుచరులు పద్మాకర్‌రెడ్డి, అంజన్‌కుమార్

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి గతంలో మార్కెట్ కమిటీ చైర్మన్‌గా, సింగిల్‌విండో అధ్యక్షుడిగా పనిచేశారు. మం త్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అనుచరుల్లో ఇ తను ఒకరు. డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని మంత్రికి మొరపెట్టుకున్నారు. పద్మాకర్‌రెడ్డి తర్వాత మంత్రికి మరో ముఖ్య అనుచరుడైన వైద్యుల అంజన్‌కుమార్ బీసీ కోటా కింద అ ధ్యక్ష పదవి ఇవ్వాలని మంత్రిని కోరారు. అ ంజన్‌కుమార్ గతంలో పీసీసీ కార్యదర్శిగా పనిచేశారు. ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రె స్ నుంచి ఎదిగిన నేత కావడంతో ఆయనకు నామినేటెడ్ పదవి కట్టబెట్టాలనే ఆలోచనలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నట్లు సమాచారం. 

రేసులో మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి

మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ కూడా డీసీసీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. ఆయన గతం లో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. మధ్యలో బీఆర్‌ఎస్‌లో అటు నుంచి బీజేపీలో చేరి పార్లమెంట్ ఎన్నికల సమయంలో సొం త గూటికి వచ్చారు. పార్టీ పెద్దలతో సత్స ంబంధాలు ఉండటంతో తనవంతు ప్రయత్నాలు ప్రారంభించారు. 

సుడా చైర్మన్ నరేందర్‌రెడ్డి 

ప్రస్తుతం నగర కాం గ్రెస్ అధ్యక్షుడిగా, సుడా చైర్మన్‌గా ఉన్న కో మటిరెడ్డి నరేందర్‌రెడ్డి అధిష్టా నం అవకాశం కల్పిస్తే అ ధ్యక్ష పదవి  చేపట్టేందు కు సిద్ధంగా ఉన్నారు.పా ర్టీ కష్టకాలంలో నగర అధ్యక్షుడిగా సేవలందించిన పేరు నరేందర్‌రెడ్డికి ఉంది. 

వెలిచాలకు మంత్రి పొన్నం మద్దతు?

గత పార్లమెంట్ ఎ న్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసిన వెలిచాల రాజేందర్‌రావును అధ్యక్షుడిగా నియమిస్తే పార్టీకి ఉపయోగకరంగా ఉ ంటుందనే భావన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. 

పదవిపై ఆకారపు ఆశలు

గతంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, మాజీ కార్పొరేటర్ ఆకారపు భాస్కర్‌రెడ్డి కూడా పదవి కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. మాజీ సీఎం రాజశేఖర్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో భాస్కర్‌రెడ్డి అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొని గాయాలపాలయ్యారు. బీఆర్‌ఎస్‌లో చేరినా గుర్తింపు లేకపోవడంతో సొంత పార్టీకి వచ్చారు.