11-09-2024 09:27:27 AM
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష అభ్యర్థుల మధ్య తొలిసారి బిగ్ డిబేట్ జరిగింది. అంశాల వారీగా ట్రంప్, హారిస్ పరస్పర విమర్శలు చేసుకున్నారు. ట్రంప్ మిగిల్చిన గజిబిజిని శుభ్రం చేశామని కమలా హారిస్ పేర్కొన్నారు. చిన్న వ్యాపారాలు, కుటుంబాలకు సాయం చేస్తామని హారిస్ తెలిపారు. బిలియనీర్లు, కార్పొరేట్లకు ట్రంప్ పన్ను తగ్గిస్తారని ఆమె ఆరోపించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ అన్ని వర్గాలకు విపత్తుగా మారిందని విమర్శించారు. హారిస్, ట్రంప్ మధ్య నేషనల్ కాన్ స్టిట్యూషన్ సెంటర్ వేదికగా చర్చ జరిగింది. 90 నిమిషాల పాటు హారిస్, ట్రంప్ మధ్య హోరా హోరీ చర్చ జరిగింది. ఈ సందర్భంగా హారిస్ మాట్లాడుతూ... ట్రంప్ అబార్షన్ విధానం అమెరికా మహిళలకు అవమానం అన్నారు. మహిళల అభివృద్ధి ట్రంప్ నుకు గిట్టదని ఆమె ఆరోపించారు. గర్భవిచ్ఛిత్తిపై మహిళలే నిర్ణయం తీసుకోగలరని హారిస్ పేర్కొన్నారు. సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మహిళలకు ఉందని తెలిపారు. ట్రంప్ అధ్యక్షుడైతే అబార్షన్ నిషేధంపై సంతకం చేస్తారని చెప్పారు.