calender_icon.png 22 July, 2025 | 12:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లోకేశ్‌ను ఎందుకు కలిశావ్!

19-07-2025 01:22:22 AM

  1. కేటీఆర్ సమాధానం చెప్పాలి
  2. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఏపీ మంత్రి లోకేశ్‌ను ఎందుకు కలిశాడో సమాధానం చెప్పాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. కేటీఆర్‌ెేలోకేశ్, కేటీఆర్ జగన్ రహస్యంగా భేటీ అయ్యారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఓ ఫార్మ్ హౌస్‌లో లోకేశ్, జగన్‌ను వేర్వేరుగా కేటీఆర్ కలిశాడని జగ్గారెడ్డి ఆరోపించారు.

బీజేపీ డైరెక్ష న్‌లోనే ఈ భేటీలు జరిగాయని పేర్కొన్నారు. ఇద్దరు సీఎంలు కూర్చొని మాట్లాడుకుంటే తప్పేంటని జగ్గారెడ్డి ప్రశ్నించారు. మీరు చాటుమాటుగా కలిస్తే తప్పు లేదుగానీ సీఎంల స్థాయి సమావేశంలో అధికారికంగా భేటీ అయితే తప్పు వచ్చిందా అని ప్రశ్నించారు. రేవంత్, మంత్రులు ఢిల్లీకి వెళ్తుంది తెలంగాణ వాటా నిధులు తేవటానికేనని స్పష్టం చేశారు.

రేవంత్‌రెడ్డి పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే ఢిల్లీ సమావేశానికి వెళ్లాడన్నారు. రేవంత్‌రెడ్డికి చంద్రబాబు గురువు అంటున్న కేటీఆర్.. వారి తండ్రి కేసీఆర్ చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రి గా పనిచేశాడనే విషయాన్ని మర్చిపోయినట్లున్నాడని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి కంటే ముందే కేసీఆర్ టీడీపీలో ఉన్న విషయం మర్చిపోవదన్నారు.