calender_icon.png 22 July, 2025 | 5:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్‌తోనే సాధ్యం

19-07-2025 01:23:33 AM

- మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ

మానకొండూరు, జూలై 18 (విజయ క్రాంతి): అభివృద్ధి, సంక్షేమం, ఉద్యోగ కల్పన కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. శుక్రవారం మానకొండూర్ మండల కేంద్రంలోని సుప్రీం ఫంక్షన్ హాల్లో మండలానికి సంబంధించిన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందించడమే కాకుండా నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని స్పష్టం చేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో చేయలేని అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలల్లోనే చేసి చూపించిందన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఆర్డిఓ మహేశ్వర్, మానకొండూర్ తహసీల్దార్ కె. విజయ్ కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నందగిరి రవీంద్రచారి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదెలు యాదవ్, వైస్ చైర్మన్ రామిడి తిరుమల్ రెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శి తాళ్లపల్లి సంపత్ గౌడ్, నాయకులు కోండ్ర సురేష్, మడుపు ప్రేమ్ కుమార్, నరేష్, బి.మహేందర్, సదయ్య, పి.కనుకయ్య, గొల్లెన కొమురయ్య, కనకం అశోక్, ఇర్ఫాన్, కొత్తకొండ శంకర్, రామిడి శ్రీనివాస్ రెడ్డి, సాయిరి దేవయ్య, సుధగోని తిరుపతి, ఏగోళం శ్రీనివాస్ గౌడ్, గోపు రవీందర్ రెడ్డి, ప్రభాకర్, తదితరులుపాల్గొన్నారు.