19-07-2025 01:21:44 AM
కరీంనగర్ క్రైం, జూలై18(విజయక్రాంతి): సినీ గేయ రచయిత గుండేటి రమేష్ రచన, గానం, దర్శకత్వం లో రూపుదిద్దుకుంటున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా వైభవ గీతం ను శుక్రవారం కేంద్ర హోం శాఖ సహాయ మం త్రి బండి సంజయ్ క్లాప్ కొట్టి ప్రారంభించారు ఈ సందర్భంగా దర్శకులు గుండేటి ర మేష్ మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ వైభ వ షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు.
ఆగస్టు 2న గుం డేటి మ్యూజిక్, మూవీస్ ద్వారా ఆల్బమ్ రిలీజ్ అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యువజన సంఘాల స మితి అధ్యక్షులు , బిజెపి రాష్ట్ర నాయకులు సొల్లు అజయ్ వర్మ, డాక్టర్ పి కిషన్, డైరెక్టర్ అక్కెన భాస్కర్, కొరియోగ్రాఫర్ శ్రీనివాస్‘-మాజీ కార్పొరేటర్ బండరమణ రెడ్డి , పా ర్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు, దుబాయ్ శ్రీనివాస్ పాల్గొన్నారు.