17 April, 2026 | 2:29 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

పైల్స్ ఎందుకు వస్తాయి?

08-06-2025 12:00 AM

పైల్స్.. చాలా ఇబ్బందిగా, అసౌకర్యంగా ఉంటుంది. 

వీటిని హెమరాయిడ్స్ అని కూడా అంటారు. ఇవి రెండు రకాలుగా ఏర్పడతాయి. బయటకు తెరచుకొని 

వచ్చే పైల్స్, లోపలి నుంచి ఏర్పడే పైల్స్. వీటితో 

బాధపడేవారు కూర్చునేందుకు చాలా ఇబ్బంది పడతారు. మల విసర్జన సమయంలోనూ నొప్పివల్ల తీవ్ర 

అసౌకర్యానికి గురవుతారు. పైల్స్ ఎందుకు వస్తాయి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం..

* దీర్ఘకాలిక మలబద్ధనికి పర్యావసానం పైల్స్

* టాయిలెట్‌లో ఎక్కువసేపు కూర్చొని ఉండటం

* పీచు పదార్థాలు లేని ఆహారాలను అధికంగా తినడం, తక్కువ నీరు తాగడం

* స్థూలకాయం, ఎక్కువసేపు కూర్చుని ఉండే పని చేయడం 

* అధికంగా బరువులు ఎత్తే పనులు చేయడం

* మల విసర్జన సమయంలో పేగు కదలిక వల్ల ఒత్తిడి 

* గర్భం కారణంగా పొత్తికడుపులో ఒత్తిడి పెరగడం

* అతిగాకారం, మసాలాలతో కూడిన వంటలుతినడం

జాగ్రత్తలు

* శరీరానికి అవసరమైన మేర నీటిని తాగితే జీర్ణవ్యవస్థ బాగుంటుంది. అందుకే రోజుకు కనీసం రెండు లీటర్ల నీళ్లను తాగాలి. దీనివల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది. 

* గంటల తరబడి కూర్చుని పనిచేసేవారు మధ్యమధ్యలో తప్పనిసరిగా కాసేపు విశ్రాంతి తీసుకుని నడవాలి. 

* టాయిలెట్‌లోకి ఫోన్‌ను తీసుకెళ్లకూడదు. మలవిసర్జనకు వెళ్లేటప్పుడు సాధ్యమైనంత వేగంగా పూర్తి చేసుకొని రావాలి. ఫోన్ చూసుకుంటూ ఎక్కువసేపు ఉండకూడదు. ఇది పైల్స్ వచ్చేందుకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. 

* బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. వ్యాయామం విషయంలో నిర్లక్ష్యం వద్దు. 

* అధికంగా పీచుపదార్థాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. రోజూ పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. నీటిని తాగడంలో నిర్లక్ష్యం వద్దు. ఒంట్లో నీటిశాతం తగ్గితే ఆహారం సరిగా జీర్ణంకాక మలబద్ధకం వచ్చే ప్రమాదం ఉంది. ఇది పైల్స్ సమస్యను పెంచుతుంది.