13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

బీజేపీకి బీసీలు అంటే వివక్షత ఎందుకు?

27-03-2026 02:41 AM

బీసీ పొలిటికల్ ఫ్రంట్

ముషీరాబాద్,మార్చి26(విజయక్రాంతి): బీజేపీ ప్రభుత్వానికి బీసీలు అంటే ఎందుకంత వివక్షత అని బీసీ పొలిటికల్ ఫ్రంట్ ప్రశ్నించింది. ఈ మేరకు గురువారం చిక్కడపల్లి లోని బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కార్యాలయం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఛైర్మెన్ బాలగోని బాల్ రాజ్ గౌడ్, వైస్ చైర్మన్ ఎస్. దుర్గయ్య, ఫ్రంట్ కన్వీనర్లు అయిలి వెంకన్న గౌడ్, ఎలికట్టె విజయ్ కుమార్ గౌడ్, అంబా ల నారాయణ గౌడ్, బైరి శేఖర్ లు  మాట్లాడుతూ దేశ జనాభాలో సగభాగమున్న బీసీలకు జనాభా దామాషా పద్ధతిలో బీసీలకు విద్యా,  ఉద్యోగ, ఆర్థిక,  రాజకీయ రం గాలలో బీజేపీ పార్టీ బీసీలకు తీవ్ర అన్యా యం చేస్తుందని వారు మండిపడ్డారు.

అదే విధంగా ఏప్రిల్ మొదటి వారంలో కేంద్ర ప్రభుత్వం చేయబట్టబోయే జాతీయ జన గణనలో బీసీలను కులాల వారిగా గుర్తించాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ వెంటనే ఏర్పాటు చేయాలని, దేశవ్యాప్తంగా  ఓబీసీలపైన జరుగుతు న్న దాడులు కుల బహిష్కరణలు దృష్టిలో పెట్టుకొని వెంటనే బీసీలకు రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో ఫ్రంట్ నాయకులు  బాలగోని వెంకటేష్, ఐలెన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.