13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

అధికారిక శ్రమదోపిడీని రద్దు చేయాలి

27-03-2026 02:40 AM
  1. కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయాలి
  2. కేజీబీవీ, యుఆర్‌ఎస్, సమగ్ర శిక్షా ఉద్యోగుల మహాధర్నాలో వక్తల డిమాండ్

ముషీరాబాద్, మార్చి 26 (విజయక్రాంతి): అధికారిక శ్రమదోపిడి ని వెంటనే రద్దు చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయాలని పలువురు  వక్తలు డిమాండ్ చేశారు. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలు, సమగ్ర శిక్షాలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది సమస్యల పరిష్కారం కోరుతూ గురువారం చలో అసెంబ్లీ కార్యక్రమంలో భాగంగా టిఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు ధర్నా చౌక్ లో మహా ధర్నా నిర్వహించారు.

టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి ధర్నాకు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ధర్నాకు హాజరైన సిపిఐ శాసన సభాపక్ష నాయకులు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హాజరై మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా కెజిబివి, యుఆర్‌ఎస్, సమగ్ర శిక్షా ఉద్యోగులకు  నామ మాత్రపు వేతనాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రమ దోపిడీకి పాల్పడుతున్నాయని ఆరోపించారు.

కాంట్రాక్టు ఉద్యో గుల కు కనీస వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాసనసభలో ప్రస్తావించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. టిఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో జాతీయ మహిళా ఉపాధ్యాయ నాయకులు ఎం.  సం యుక్త, టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష,  కార్యదర్శులు  చావ రవి, ఎ.వెంకట్, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి బి. మధు, టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దుర్గా భవాని, కోశాధికారి టి.లక్ష్మారెడ్డి, కెజిబివి, యు ఆర్‌ఎస్, సమగ్ర శిక్ష నాయకులు విశాలాక్షి, లక్ష్మి, మంజుల, గోపిలత, యాదగిరి, పాషా, సురేందర్, కుమార స్వామి, గంగామణి, మంజు లత, సుమన చైతన్య, మంజుల, వెంకటప్ప, రాజు, రవికుమార్, సింహాచలం, విశా లి, చిన్నయ్య, వివిధ జిల్లాల టిఎస్ యుటిఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.