calender_icon.png 21 June, 2025 | 8:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖానాపూర్‌పై వివక్ష ఎందుకు?

21-06-2025 12:00:00 AM

  1. ఇంటిగ్రేటెడ్ పాఠశాల కోసం ఉద్యమించనున్న పార్టీలు
  2. ఉట్నూర్ కు తరలిస్తే ఉద్యమిస్తామని హెచ్చరిక
  3. ఈ ప్రాంత విద్యార్థులకు నష్టం జరుగుతుందని ప్రజల అభిప్రాయం
  4. ప్రస్తుత కేటాయింపు నిర్మల్ జిల్లాకేనని వాదన

ఖానాపూర్ (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం లో కాకుండా ఇతర ప్రాంతానికి తరలించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు  .రాష్ట్ర ప్రభుత్వం నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరు చేయగా అది ఏ ప్రాంతంలో నిర్మాణం చేయాలనేది సర్వత్ర చర్చనీయాంశమైంది.

దానికోసం తమకంటే తమకంటూ ఖానాపూర్, ఉట్నూర్, ప్రాంత స్థానికులు పట్టుబట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ఆ పాఠశాల నిర్మాణం ఉట్నూరులో జరుప తలపెట్టినట్లు నిర్ణయం కాగా, ఖానాపూర్ ప్రాంత ప్రజలు ఆ పాఠశాల ఖానాపూర్ లోనే నిర్మించాలని పట్టుబడుతూ ఇక్కడి అఖిలపక్ష నాయకులు ఏకతాటి మీదికి వచ్చి ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం?.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిర్మల్ జిల్లాకు ఈ పాఠశాల కేటాయించినట్లు ఉత్తర్వులు కాగా ఖానాపూర్ నియోజకవర్గం అన్ని మండలాలు మొత్తం మూడు జిల్లాల్లో నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాలలో విస్తరించి ఉండగా ఇక్కడి నాయకులు ప్రజలు నిర్మల్ జిల్లాలోనే పాఠశాల ఉండాలని పట్టుబడుతున్నట్లు సమా చారం.

ఇక్కడ విద్యార్థు లు ఉట్నూరులో చదివితే జిల్లా పరంగా నాన్ లోకల్ అయ్యే ప్రమాదం ఉంటుందని, దాంతో ఇక్కడి నాలుగు మండలాల విద్యార్థులకు అది పనికిరాకుండా పోతుందని పలువు రు వాపోతున్నట్లు తెలుస్తోంది .ఈ నేపథ్యంలో ఖానా పూర్ భౌగోళిక అంశం నేపథ్యంలో ఈ పాఠశాల ఎక్కడ నిర్మించాలన్న అంశం నియోజకవర్గ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశమైంది.

ఆ పాఠశాల నిర్మాణంతో స్థానికంగా మార్కెట్, వ్యాపారాలు ,చాలా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నందున ఇరుప్రాంత ప్రజలు పట్టుబట్టే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి ఖానాపూర్ మండలంలో దశలవారి ఆందోళనలు చేసేందుకు అఖిలపక్ష పార్టీలు సిద్ధమవుతున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు. ఈ దశలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమా బొజ్జు పటేల్ నిర్ణయమే తుది నిర్ణయం అని అభిప్రాయం వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తోంది. ఏం జరగబోతుందో వేచి చూడాలి.