19-12-2025 01:25:03 AM
ఘట్‌కేసర్, డిసెంబర్ 18 (విజయక్రాంతి): జిహెచ్‌ఎంసి ఘట్ కేసర్ సర్కిల్ పరిధిలోని అవుషాపూర్ లో గురువారం భవన నిర్మాణ కార్మికులకు ఉచితంగా లేబర్ కార్డులు పంపిణీ చేశారు. భవన నిర్మాణ కార్మికులకు ఎంతో ప్రయోజకరంగా ఉండే ఈ లేబర్ కార్డులను వైయస్ రెడ్డి ట్రస్టు ఆధ్వర్యంలో దరఖాస్తు చేసుకున్న 200 మంది భవన నిర్మాణ కార్మికులకు ట్రస్టు వ్యవస్థాపకులు,
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఏనుగు కావేరి మచ్చందర్ రెడ్డి చేతుల మీదుగా ఉచితంగా పంపిణీ చేశారు. మరో 250 మంది భవన నిర్మాణ కార్మికులు లేబర్ కార్డు కోసం అందజేసిన దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి దళిత మోర్చా జిల్లా నాయకులు కె. కరుణాకర్, పెద్ద సంఖ్యలో భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.