29 April, 2026 | 3:20 AM

మేడేను జయప్రదం చేయాలి

29-04-2026 01:11 AM

పాలకవీడు, ఏప్రిల్  28: మేడెను జయప్రదం చేయాలనీ గుర్రం ధనమూర్తి అధ్యక్షణ మంగళవారం సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కందగట్ల అనంత ప్రకాష్ మాట్లాడుతూ పాలకవీడు మండల కేంద్రంలో మే 1న జరిగే మేడే కార్యక్రమంలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న సంఘటిత అసంఘటిత మరియు స్కీం వర్కర్స్ ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్స్ మధ్యాహ్న భోజన కార్మికులు గ్రామపంచాయతీ వర్కల్లు తదితర రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

ఇందిరమ్మ ఇండ్లు ప్రతి గ్రామంలో మంజూరు చేయాలని రాజకీయ జోక్యం లేకుండా నిరుపేదలకు ఇండ్లు అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ మాజీ వైస్ చైర్మన్ పగడాల మాటేష్ మాజీ ఎంపీటీసీ దొంగల వెంకటయ్య మాజీ సర్పంచ్ గుర్రం ధన మూర్తి సిపిఎం మండల నాయకులు వీరభద్రం, దిద్దకుంట్ల పురుషోత్తంరెడ్డి, ఎర్రెడ్ల మల్లారెడ్డి, ఏసురత్నం, నన్నే పంగ రమేష్, తదితరులు పాల్గొన్నారు.