7 August, 2026 | 1:34 AM

అక్రమ కట్టడాల కూల్చివేత సాగేనా..?

07-08-2026 12:48 AM
  1. కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జా 
  2. అక్రమ కట్టడాల జాబితాలో ప్రముఖులు 
  3. ప్రభుత్వ భూమి గుర్తించినా హద్దులు వేయని అధికారులు 
  4. అక్రమ కట్టడంపై రెండేళ్లు పోరాడిన మహిళలు 

మెట్ పల్లి,ఆగస్టు6 (విజయక్రాంతి): మెట్ పల్లి పట్టణంలో పట్టణ ప్రణాళిక శాఖ అధికారులు మామూళ్ల మత్తులో కళ్లు మూసు కోగా యాదేచ్చగా అక్రమ నిర్మాణాలు జరిగాయి.అవినీతి అధికారుల అండదండలతో బరితెగించిన కొందరు కబ్జా రాయుళ్లు ఏకం గా ప్రభుత్వ భూములు చేరపట్టి నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారు.

అక్ర మ నిర్మాణాలపై ఎన్ని పిర్యాద్ లు వచ్చి న టౌన్ ప్లానింగ్ అధికారులు అటు వైపు కన్నె త్తి చూడక పోవడానికి లక్షల్లో డబ్బులు చే తులు మారయానే ఆరోపణలు బహిరంగం గా వినిపిస్తున్నాయి. మా మామూళ్లు మాకు ఇచ్చి మీరు నిబంధనలకు విరుద్ధంగా ఏమై నా చేసుకోండి అంటూ సాగిన టౌన్ ప్లానిం గ్ అధికారుల వైఖరిపై జిల్లా అధికారులు వా రిని పక్కన పెట్టి విచారణ ప్రారంభం చేయ డం పట్టణంలో హాట్ టాపిక్ గా మారింది. 

టీపీవో రాకతో పెరిగిన అవినీతి 

మెట్ పల్లి మున్సిపాలిటీకి టౌన్ ప్లానింగ్ అధికారిగా రాజేంద్ర ప్రసాద్ రావడంతో స్థానిక భూ కబ్జా రాయుళ్లకు పంట పండిన ట్టు అయింది.ఆయన హయాంలోనె పట్టణంలో అక్రమ కట్టడాలు పెరిగాయానే ఆరో పణలు ఉన్నాయి.ప్రస్తుతం అక్రమ కట్టడాలుగా గుర్తించిన నిర్మాణాలలో అధికంగా ప్రముఖులవి ఉన్నాయి. ఇక ఏడాది క్రితం పట్టణ పరిధిలో ఒక మహిళాకు ఇంటి పర్మిషన్ ఇస్తున్నాం అంటూ ఫోన్ పే ద్వారా డబ్బులు తీసుకోని నకిలీ పర్మిషన్ పత్రాలు అందివ్వడం జరిగింది.

అదే మహిళాను నీ ఇంటి పర్మిషన్ సరిగా లేదంటూ మళ్ళీ డబ్బులు డిమాండ్ చేయడంతో ఆమె జిల్లా కలెక్టర్ ను ఆశ్రయించింది. దింతో టిపివో రాజేంద్ర ప్రసాద్ ను కలెక్టర్ సస్పెండ్ చేస్తూ విచారణ కు ఆదేశించారు. కొద్ది రోజుల క్రితం విచారణకు వచ్చిన వరంగల్ ఆర్జెడి అధికారులు బాధితురాలి నుండి వివరాలు సేకరించారు.

తాను ఇచ్చిన తప్పుడు పర్మిషన్ లపై ఎవరైనా పిర్యాద్ చేసిన చివరికి విలేకరులు వార్తలు రాసిన వారిపై కబ్జా రాయుల్లతో పోలీస్ స్టేషన్ లో పిర్యాద్ చేయించి బెదిరింపులకు పాల్పడడం ఆ టిపివో పద్ధతి.ఆయన మెట్ పల్లి కి బదిలీ పై వచ్చిన నుండి ఇచ్చిన ఇంటి పర్మిషన్ లపై విచారణ చేపడితే జరిగిన లక్షలాది రూపాయల అవినీతి బయటకు వచ్చే అవకాశం ఉంది.

ప్రభుత్వ భూమిలోనూ ఇదే వైఖరి

స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని వెంపేట్ రోడ్డు లో ఒక వ్యక్తి రెండు సంవత్సరాల క్రితం షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం ప్రారం భం చేయడం జరిగింది. ఈ నిర్మాణం ప్రభు త్వం తమకు కేటాయించిన భూమి ఆక్రమించి కడుతున్నారని మహిళా సంఘం సభ్యులు వెళితే వారిపై అక్రమార్కులు దాడికి ప్రయత్నం చేశారు. వారు తప్పించుకొని పోలీస్ లను ఆశ్రయించగా ఇరువ ర్గాలతో సంబందింత ఉన్నతాధికారులు లేదా కోర్ట్ ద్వారా తేల్చుకోవాలని పోలీస్ లు చెప్పి పంపించారు.

అప్పటి నుండి మహిళా సంఘ సభ్యులు రెండు సంవత్సరాలు ఆర్జెడి వరంగల్ అధికారులకు, సిడిఎంఎ రాష్ట్ర అధికారులకు పిర్యాద్ లు చేస్తూ తిరుగుతున్నా రు. రాష్ట్ర, జిల్లా అధికారుల ఆదేశాలతో ఎట్టకేలకు స్పందించిన స్థానిక రెవెన్యూ అధికా రులు రెండు నెలల క్రితం కొలతలు చేపట్టాగా దాదాపు రెండు గదులు ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 1536లో నిర్మాణం చేసినట్టుగా గుర్తించారు.

పిదప స్థానిక ఆర్డివోతో పాటు మున్సిపల్ అధికారులకు కూడ లేఖ ద్వారా ప్రభుత్వ భూమి కబ్జా విషయం తెలిపిన ఇప్పటికి కూడా ఆ భూమి లో టౌన్ ప్లానింగ్ అధికారులు హద్దులు ఏర్పాటు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.

రెండు కోట్ల భూమి కి ఎసరు

సర్వే నంబర్ 1536లో కబ్జా రాయుళ్లు చెర బట్టిన భూమి విలువ సుమారు రెండు కోట్ల వరకు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. దింతో బరుతెగించిన కబ్జా రాయు ళ్లు అధికారులకు లక్షల నాజారణాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. వినని అధికా రులకు తమ రాజకీయ పలుకుబడి ఉపయోగించి బెదిరింపులకు దిగినట్టు తెలిసింది.

రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టి ప్రభుత్వ భూమి కబ్జా జరిగింది అని ధ్రువీకరించి రెండు నెలలు గడిచిన కబ్జా రాయుళ్లు తమ నిర్మాణాలు పూర్తి చేయడం, వాటిని అద్దెలకు ఇవ్వడం జరిగింది.వాటిలో ఉన్న వ్యాపార సంస్థ లకు ట్రేడ్ లైసెన్స్ లేకున్నా వారికి నోటీసులు జారీ చేయక పోవడం వెనుక మళ్ళీ మమ్ముళ్లు చేతులు మారయా నే ఆరోపణలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రభుత్వ భూమి ని స్వాధీనం చేసుకొని కబ్జా రాయు ల్ల పై చట్టపరమైన చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

ప్రభుత్వ భూమిలో జరిగిన అక్రమ నిర్మానాన్ని తొలగిస్తాం

ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మా ణం చేపట్టిన నిర్మాణా న్ని తొలగించి ఆ భూమిని స్వాధీ నం చేసుకోవడం తో పాటు సెట్ బ్యాక్ వదలని నిర్మాణం కూడ తొలగిస్తాం.ఆ గదులలో ట్రేడ్ లైసెన్స్ లేని దుకాణాలను కూడ మూసి వేస్తాం.

మెట్ పల్లి మున్సిపల్ 

కమిషనర్,శ్రీనివాస్ గౌడ్