7 August, 2026 | 1:49 AM

ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను భావితరాలకు చాటాలి

07-08-2026 12:47 AM

* జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

జనగామ, ఆగస్టు 6 (విజయక్రాంతి): గురువారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన గావించి, పూలమాలలు సమర్పించి, ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త, మేధావి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

జయశంకర్ ఆశయాలు, భావజాలం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. అదే విధంగా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోం, జనగామ మున్సిపల్ ఛైర్పర్సన్ కడకంచి బాలమణి, కుల సంఘాల ప్రతినిధులు, సభ్యులు, అధికారులు అందరూ హాజరై, జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ అధికారి ఎన్.ఎల్. నరసింహ రావు, వైటిడిఎ సభ్యులు లక్ష్మి నారయణ నాయక్, సీనియర్ పాత్రికేయులు కన్నా పరశురాములు, సంక్షేమ శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.