7 August, 2026 | 1:46 AM

ఆచార్య జయశంకర్ ఆశయాల సాధనే నిజమైన నివాళి

07-08-2026 12:49 AM

డీసీసీ అధ్యక్షులు బట్టు కరుణాకర్

భూపాలపల్లి టౌన్, ఆగస్టు 6 (విజయక్రాంతి): ఆచార్య జయశంకర్ ఆశయాల సాధనే వారికి మనం ఇచ్చే నిజమైన నివాళి అని కాంగ్రెస్ పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు బట్టు కరుణాకర్ అన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త, మహామేధావి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించగా కరుణాకర్ ముఖ్య అతిధిగా హాజరై జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కరుణాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకు సిద్ధాంతపరమైన దిశానిర్దేశం చేసి ఉద్యమానికి మేధోబలాన్ని అందించిన మహనీయుడు ఆచార్య జయశంకర్ అని అని కొనియాడారు.  యువత ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొంది సమాజాభివృద్ధి, ప్రజాసేవ కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు చల్లూరి మధు, వెంకీ యాదవ్, దాట్ల శ్రీను, బుచ్చయ్య, విజయ్, బౌత్ రమేష్, రాజేష్, పట్టణ కాంగ్రెస్ నాయకులు మాకోటి శ్వేత, ప్రభాకర్, కురిమిళ్ల శ్రీను, బొడ్డు రేణుక, పద్మ, అశోక్, సహదేవ్, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్యూఐ, సేవాదళ్, అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు.