15 నుంచి కొత్త రేషన్ కార్డులు
సంగారెడ్డిలో సీఎం చేతులమీదుగా ప్రారంభం
- అదే రోజు 119 నియోజకవర్గాల్లో పంపిణీ
- 1.05 కోట్ల పీడీఎస్ కార్డులు సిద్ధం
- ప్రతి పేద కుటుంబానికి ఆహారభద్రతే లక్ష్యం
- పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి) : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మ కంగా చేపట్టిన తెల్లరేషన్ కార్డుల పంపిణీకి మూహుర్తం ఖరారైంది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా మంజూరైన 1.05 కోట్ల లామినేటెడ్ రేషన్ కార్డులను ఆగస్టు 15 నుంచి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిం ది. సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని ప్రారంభించనుండగా, అదే రోజు రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏక కాలంలో కార్డుల పంపిణీ చేపట్టనున్నారు.
ఈ మేరకు నీటిపారుదల, ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి నియోజకవర్గంలో రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) సమన్వయంతో జిల్లా యంత్రాంగం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి ఆదేశించా రు. రేషన్ కార్డుల పంపిణీని తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతుందని తెలిపారు.
కొత్తగా అర్హత పొందిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షే మ పథకాల ఫలాలు చేరేలా ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవ అధికారిక కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని ఆగస్టు 15న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రేషన్ కార్డుల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి వెల్లడించారు.
లబ్ధిదారుల జాబితాల ఖరారు నుంచి కార్డుల ముద్రణ, రవాణా, పంపి ణీ కేంద్రాల ఏర్పాట్లు, ప్రజా సౌకర్యాల కల్పన, మీడియా ప్రచారం, ఫొటో, వీడియో గ్రఫీ వరకు అన్ని ఏర్పాట్లను సమగ్రంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. పేద కుటుంబాల ఆహార భద్రతను మరింత బలోపేతం చేస్తూ, ప్రజాపంపిణీ వ్యవస్థ ప్రయోజనాలను కొత్తగా అర్హత పొందిన ప్రతి కుటుంబానికి చేరవేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. సంక్షేమ పాలనలో ఈ కార్యక్రమం మరో కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు.






