23 July, 2026 | 1:03 AM

కామన్‌వెల్త్ క్రీడా సంబరం

23-07-2026 12:33 AM

ఫిఫా ప్రపంచకప్ ముగిసి నాలుగు రోజులైనా కాకముందే మరో క్రీడా సంబరం వచ్చేస్తోంది. గురువారం నుంచే గ్లాస్గో వేదికగా కామన్‌వెల్త్ గేమ్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఈ సారి తక్కువ బడ్జెట్‌లో, తక్కువ క్రీడాంశాలతో జరగబోతున్నాయి. ఈ క్రీడల చరిత్రలో తొలిసారి ఇండోర్ స్టేడియంలో ఆరంభ వేడుకలు నిర్వహిస్తున్నారు. 11 రోజుల పాటు అలరించనున్న కామన్‌వెల్త్‌గేమ్స్‌లో ఏ దేశం ఎక్కువ పతకాలు గెలుస్తుందో చూడాలి.

  1. నేటి నుంచే గ్లాస్గో వేదికగా గేమ్స్
  2. ఇండోర్ స్టేడియంలో ఆరంభవేడుకలు
  3. ఈ సారి 10 క్రీడలకే పరిమితం
  4. 74 దేశాల నుంచి 3 వేల మంది 

గ్లాస్గో, జూలై 22 : నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగే కామన్‌వెల్త్ గేమ్స్‌కు స్కాట్లాం డ్ ఆతిథ్యమిస్తుండడం ఇది నాలుగోసారి. బ్రిటీ ష్ సామ్రాజ్యంలో భా గంగా ఉండి, ప్రస్తుతం కామన్‌వెల్త్ ఆఫ్ నేషన్స్‌లో సభ్యులుగా ఉన్న దేశాల క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటారు. మొదటిసారిగా 1930లో కెనడాలోని హామిల్టన్ నగరంలో ఈ క్రీడలు ప్రారంభమయ్యా యి. ఈ సారి కామన్‌వెల్త్ గేమ్స్ కు తక్కువ బడ్జెట్ ఉండడంతో చాలా క్రీడలను తొలగించారు.

కేవలం 10 క్రీడల్లో మాత్రమే పోటీ లు జరగనున్నాయి. 74 దేశాల నుంచి 3 వేల మంది అథ్లెట్లు పా ల్గొంటున్నారు. ఆస్ట్రేలియాలోని విక్టోరియా ఆతిథ్యం నుంచి వైదొలగడం తో, గ్లాస్గో తక్కువ సమయంలో బాధ్యతలు చేపట్టింది. ప్రభుత్వ నిధులు లేకుండా, ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలను ఉపయోగించి గేమ్స్ నిర్వహి స్తున్నారు. ఈ కారణంగానే క్రీడలను కుదించారు. కామన్‌వెల్త్ గేమ్స్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆరంభ వేడుకలను తొలిసారి ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నారు.

బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III, రాణి కెమిల్లా ఈ వేడుకకు హాజరై, క్రీడలను అధికారికంగా ప్రారంభించనున్నారు. బ్రిటీష్ రాయల్ ఎయిర్‌ఫోర్స్ రెడ్ ఆరోస్ ఫ్లైఓవర్ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. స్కాట్లాండ్ కు చెందిన ప్రముఖ సింగర్స్ టన్‌సాల్, టామ్ వాకర్, కలమ్ బీటీ, నినా నెస్బిట్, నాథన్ ఎవాన్స్ తమ సంగీత ప్రదర్శనలతో అలరించనున్నారు. కింగ్స్ బ్యాటన్ రిలే ఈ వేడుకతోనే ముగుస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పటివరకు జరిగిన క్రీడల్లో ఆస్ట్రేలియా అత్యధికంగా 2,000 పైగా పతకాలు సాధిం చి అగ్రస్థానంలో కొనసాగుతోంది.

భారత్‌కు కూడా కామన్‌వెల్త్ క్రీడల్లో అద్భుతమైన రికా ర్డు ఉంది. బర్మింగ్ హామ్ వేదికగా జరిగిన గత కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత్ 61 పతకాలు సాధించి నాలుగో స్థానంలో నిలిచిం ది. ఇప్పుడు గ్లాస్గో వేదికగా జరుగుతున్న ఎడిషన్‌లో రెజ్లింగ్, బ్యాడ్మింటన్, హాకీ వం టి భారత్‌కు పతకాలు వచ్చే క్రీడలు లేకపోవడంతో ఈసారి పతకాలపై కొంత ప్రభావం పడనుంది. కాగా ఆగస్టు 2 వరకూ జరగనున్న ఈ క్రీడల తర్వాతి ఎడిషన్ (2030)కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. గ్లాస్గోలో ముగిం పు వేడుకులకు భారత ప్రధాని మోదీ హాజరై కామన్‌వెల్త్ గేమ్స్ ఆతిథ్య పతకాన్ని అందుకుంటారని తెలుస్తోంది. 2030లో అహ్మదా బాద్ వేదికగా క్రీడలు జరగబోతున్నాయి.

ఆతిథ్య నగరం : గ్లాస్గో, స్కాట్లాండ్

షెడ్యూల్ : జూలై 23 2

అథ్లెట్ల సంఖ్య : 74 దేశాల నుంచి 3000 మంది

క్రీడలు : అథ్లెటిక్స్, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, జూడో, నెట్‌బాల్, స్మిమ్మింగ్, ట్రాక్ సైక్లింగ్, లాన్ బౌల్స్, జిమ్నాస్టిక్స్, 3x3 బ్యాస్కెట్‌బాల్