17 April, 2026 | 10:25 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ఉగ్ర చర్యలు ఆగేనా?

13-05-2025 12:00 AM

కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత కేవలం మూడు గంటల్లోనే భారత సరిహద్దు రాష్ట్రాలపై పాకిస్థాన్ డ్రోన్ దాడులు చేసింది. ఇలా ఎందుకు జరిగింది? ‘ఆపరేషన్ సిందూర్’ లక్ష్యం పహల్గాంలో అమాయక టూరిస్టులను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాద సంస్థల నడ్డివిరవడం. మరి లక్ష్యం నెరవేరిందా? ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకొని భారత చేసిన దాడుల్లో తొమ్మిది ప్రాంతాల్లో పాకిస్థాన్ జనావాసాలు, మిలిటరీ స్థావరాలు లేవు.

అలాంటప్పుడు పాకిస్థాన్ రాజౌరి మొదలుకొని భారత సరిహద్దు నగరాలను ఎందుకు టార్గెట్ చేసింది? పాకిస్థాన్‌కు కావాల్సింది యుద్ధం. భారత్‌లోని కశ్మీర్ రెండు దేశాల మధ్య ఎప్పటికీ ద్వైపాక్షిక సమస్యేనని ప్రపంచానికి చెప్పడం పాక్ లక్ష్యం. అందుకు సమస్యలు ఎన్నిఉన్నా, పాక్ కయ్యానికి కాలుదువ్వుతూనే ఉంటుంది. కాల్పుల విరమణ మాటున కూడా పాక్ ఆర్మీ ‘ఆపరేషన్ సిందూర్’పై ప్రతీకార ధోరణికి ప్రదర్శించింది.

ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా భారత వైమానిక దళాలు తమ దేశంలో కలిగించిన నష్టాన్ని పాకిస్థాన్ ఆర్మీ జీర్ణించుకోలేకపోతున్నది. భారత సైనికాధికారులు చెపుతున్న దానిని భట్టి, పాకిస్థాన్ సైనిక స్థావరాలకు భారీ నష్టమే జరిగింది. తమ అణ్వస్త్ర స్థావరాలకు కూడా భారత సైనిక దాడుల వల్ల ముప్పు ఉందని పాక్ భావించి ఉండవచ్చు.

వాణిజ్య ప్రయోజనాలతోనే, ఐఎంఎఫ్ రుణం పొందేందుకు షరుతుగానో.. చివరికి అనేక ఒత్తిళ్ల నేపథ్యంలో పాక్ కాల్పుల విరమణ మంత్రం జపించక తప్పలేదు. మరి భారత్ పహల్గాం దాడికి ప్రతీకారంతీరం తీర్చాకుందా? ఇక పాక్ భూభాగం నుంచి భారత్‌కు ఉగ్ర ముప్పు తొలిగిపోయినట్టేనా? భారత్ ఎందుకు కాల్పుల విరమణకు అంగీకరించాలి? ఇక పాకిస్థాన్ వైపు నుంచి ఎలాంటి ఉగ్రదాడి జరిగినా దానిని యుద్ధంగానే పరిగణిస్తామన్న ప్రధాని మోదీ ఎందుకు వెనుకడుగు వేసినట్టు? అమెరికా మధ్యవర్తిత్వం అంటూ తెరవెనుక నడిచిన బాగోతంతో భారత్ ఆలోచానలో పడిందనేది మిలటరీ విశ్లేషకుల అంచనా.

యుద్ధం అంచుదాకా వెళ్లిన పరిస్థితుల్లో పైచేయి సాధించిన భారత్, కాల్పుల విరమణలో అంగీకరించడం వెనుక అనేక అంశాలు ఉన్నాయి. కశ్మీర్‌పై మూడోదేశం మధ్యవర్తిత్యానికి భారత్ మొదటి నుంచి వ్యతిరేకం. మూడోదేశం మధ్యవర్తిత్వంతోనైనా కశ్మీర్ అంశాన్ని తిరిగి తెరపైకి తెచ్చి పబ్బం గడుపుకోవాలాని పాక్ మరోసారి ప్రయత్నం చేస్తున్నది.

అందుకే కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వాన్ని అంగీకరించేది లేదని తెగేసి చెప్పిన భారత్, ఇప్పుడు ఇరుదేశాలు మధ్య ఉద్రికత్తలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవరిత్వంతోనే సమసిపోయాయానే భావననూ తిరస్కరించింది. అయినా ‘మోదీజీ అమెరికా ఒత్తిళ్లకు లొంగకండి. పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందుర్ కొనసాగించి బలూచిస్థాన్, గిల్గిత్‌కు స్వాత్రంత్య్రాన్ని తెచ్చే అవకాశాన్ని వదలుకోవద్దు.

1971లో ఇందిరాగాంధీ చూపిన చొరవ ధైర్యాన్ని మళ్లీ మోదీజీ చూపాలి’ అంటూ భారత ప్రజానీకం ఇప్పుడు ఎలుగెత్తి నినదిస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా అందుకు అనుకూల సందేశాలిస్తున్నది. ఆపరేషన్ సిందూర్ తర్వాత, సైనిక ఉద్రిక్తల నడుమ కాల్పుల విరమణ తర్వాత, పాకిస్థాన్‌పై భారత ప్రభుత్వ వైఖరి ఎలా వుంటుందనేది చూడాల్సిందే.