రైతు సాయంపై రంధ్రాన్వేషణ చేస్తారా?
మాజీ మాంత్రి నిరంజన్‌రెడ్డి
హైదరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): రుణమాఫీ అందరికి వర్తింప జేయాలని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల హామీ ప్రకారం రుణమాఫీ ప్రతిఒక్కరికీ వర్తింప చేయాలని కోరారు. దేశంలో మొదటిసారి కేసీఆర్ రైతుబంధు అమలు చేయడంతో కేంద్రం మీద ఒత్తిడి పెరిగి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన తీసుకు వచ్చిందని గుర్తు చేశారు. అదీ ఏడాదికి ఈ పథకం కింద మూడు విడుతల్లో ఇచ్చేది రూ.6 వేలు మాత్రమే అని, దానికి కూడా కేం ద్రం సవాలక్ష ఆంక్ష లు విధించిందన్నా రు. దానిని ప్రాతిపదికగా తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని 70 లక్షలకు పైగా ఉన్న రైతుల్లో సగానికి సగం మంది రైతులకు పథకాలను ఎగ్గొట్టేందుకు రంగం సిద్ధం చేస్తుందని ఆరోపించారు. రూ.2 లక్షల రుణమాఫీ అన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏడు నెలలుగా హామీల ఎగవేతకు రంధ్రాన్వేషణ చేస్తున్నారని మండిపడ్డారు.






