నన్ను కూడా చంపేస్తారేమో..?
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్‌రెడ్డి
జడ్చర్ల, అక్టోబర్ 13: వారి తమ్ముడినే చంపేశారు నన్ను కూడా చంపేస్తారో ఏమో అంటూ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఘాటుఅంటూ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఘాటైన వాక్యాలు చేశారు. జడ్చర్ల పట్టణంలో వరద నీటి కష్టాలను శాశ్వితంగా తొలగించడానికి అవసరమైన అదనపు నిధులను తీసుకువస్తానని, జడ్చర్లను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి హామీ ఇచ్చారు.
వరద నీటి కాల్వల నిర్మాణం కోసం ఇది వరకే మంజూరైన రూ.14 కోట్లు కాకుండా, ప్రస్తుతం రోడ్లు, డ్రైన్ల కోసం రూ.12.5 కోట్లు కూడా మంజూర య్యాయని, ఇవి కాకుండా మరో రూ.70 కోట్లు జడ్చర్ల అభివృద్ధి కోసం తీసుకురావడానికి కృషి చేస్తున్నానని వెల్లడించారు. జడ్చర్ల, బాదేపల్లి, కావేరమ్మపేట ప్రాంతాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని ప్రకటించారు.
మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ప్రచారం జరగడంతో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఈ విధంగా స్పందించినట్లు తెలుస్తుంది. ఈ ప్రాంతంలో ఇప్పటివరకు ఫ్యాక్షన్ రాజకీయాలు లేవని, ప్రజలు స్వేచ్ఛగా జీవనం సాగిస్తున్నారని తెలిపారు. సర్పంచి పదవి కోసం సొంత తమ్ముడిని చంపారన్నారు. రేపు ఎమ్మెల్యే పదవి కోసం నన్ను కూడా చంపే అవకాశాలు ఉన్నాయని హాట్ కామెంట్స్ చేశారు.
ఇలాంటివారు పార్టీలోకి వస్తే జెడ్ సెక్యూరిటీ అడగాలని ప్రశ్నించారు. ఎన్నికల కంటే ముందు మమ్మల్ని ఓడగొట్టాలని చూసిన వారిని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడం జిల్లాలోని ఎమ్మెల్యేలు ఎవరికి ఇష్టం లేదని తెలిపారు.
గేటు దగ్గరికి వెళ్తే అపాయింట్మెంట్ కూడా దొరకని పరిస్థితులు ఉన్నాయని కావాలని ఇలాంటి లీకులు ఇస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎన్నికల కంటే ముందు బి ఆర్ ఎస్ పార్టీలో చేరిన వారికి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం పలకదని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షులు ఎట్టి పరిస్థితుల్లో ఎందుకు ఒప్పుకోరని స్పష్టం చేశారు.






