calender_icon.png 14 October, 2025 | 2:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం

14-10-2025 12:10:58 AM

ముస్తాబాద్, అక్టోబర్ 13(విజయ క్రాంతి): ముస్తాబాద్ మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి చిత్రపటానికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏళ్ల బాల్ రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా  మాట్లాడుతూ వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కోసమని గత ప్రభుత్వం ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయలు ఇస్తానని మోసం చేస్తే..కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో వచ్చే వంద సంవత్సరాల వరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దక్షిణ కాశీ గా పేరొందిన రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారని అన్నారు.

పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో సీఎం రేవంత్ రెడ్డి మాట ఇచ్చిన సంగతి గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ చొరవతో  ఆ దిశగా ముందడుగు వేస్తుంటే ఈ బీజేపీ ఓర్వకుండా అనవసర రాద్ధాంతం చేస్తుందన్నారు. కేవలం మతం పేరుతో ప్రజల మధ్యలో చిచ్చులు పెట్టి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడం ఇకనైనా మానుకోవాలని ఖబర్దార్ బిజెపి నాయకులను హెచ్చరించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం కేంద్ర మంత్రి బండి సంజయ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని  ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రకటనలు మానుకోవాలన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి, నాయకులు  పాల్గొన్నారు.