15 June, 2026 | 9:28 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •   ఘనంగా పాఠశాల పునఃప్రారంభం   •   రామలక్ష్మి పురం ప్రాథమిక పాఠశాల బడి పునఃప్రారంభం   •   ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే: జిల్లా కలెక్టర్ అంకిత్   •   ట్రాన్స్‌ఫార్మర్‌లో భారీ అగ్నిప్రమాదం   •   బల్మూర్ ఎంపీడీవోగా రేవంత్ రెడ్డి బాధ్యతల స్వీకరణ   •   అక్రమ మట్టి రవాణాపై కఠిన చర్యలు   •   కామారెడ్డి టిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ కి సన్మానం   •   ఘనంగా ఉప ముఖ్యమంత్రి భట్టి జన్మదిన వేడుకలు   •  

క్రీడల్లో గెలుపోటములు సహజం

05-11-2024 04:40 PM

సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ దేవేందర్ 

మందమర్రి (విజయక్రాంతి): క్రీడల్లో గెలుపోటములు సహజమని ఓటమితో కుంగిపోకుండా భవిష్యత్తు విజయాల కోసం సరైన ప్రణాళికలు రచించి క్రీడల్లో మెలుకువలు పాటిస్తూ విజయాలు సాధించాలని సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ జి.దేవేందర్ అన్నారు. మంగళవారం పట్టణంలోని సింగరేణి హైస్కూల్ మైదానంలో డబ్లుపిఎస్ జిఏ ఆధ్వర్యంలో, రెండు రోజుల పాటు నిర్వహించనున్న కంపెనీ స్థాయి ఫుట్ బాల్ టోర్నమెంట్ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఆటల ద్వారా మానసిక శారీరక ఉల్లాసంతో పాటు శరీర దృఢత్వం కలుగుతుందని ప్రతి ఒక్కరు తమకు నచ్చిన క్రీడల్లో రాణించాలని సూచించారు.

క్రీడాకారులు అందరూ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ తో క్రీడల్లో పాల్గొని గెలుపు ఓటములను సమానంగా భావించాలని అన్నారు. కంపెనీ స్థాయి పోటీలలో గెలుపొందిన క్రీడాకారులు కోల్ ఇండియా పోటీలలో పాల్గొని తమ ప్రతిభను కనబరిచి సింగరేణి సంస్థకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. రెండు రోజులపాటు జరగనున్న పోటీలలో పోటీలలో గెలుపొందిన వారికి చివరిరోజు ఈనెల 6న బహుమతి ప్రధానము చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి బ్రాంచ్ సెక్రెటరీ సలేంద్ర సత్యనారాయణ, సీఎంఓఎఐ అధికారి పైడీశ్వర్, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, స్పోర్ట్స్ సమన్వయకర్త సీనియర్ పిఓ ఎం కార్తీక్, స్పోర్ట్స్ సూపర్వైజర్ కార్పొరేట్ పాస్నెట్, స్పోర్ట్స్ సూపర్వైజర్లు జాన్ వెస్లీ, సిహెచ్ అశోక్, హెచ్ రమేష్, పి శ్రీనివాస్, నరేందర్ రెడ్డి, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ ఎస్ శివకృష్ణ, జనరల్ క్యాప్టన్ సాక శ్రీనివాస్, అన్ని ఏరియాల క్రీడాకారులు, అధికారులు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.