19-11-2024 12:00:00 AM
నేడు ప్రతిఒక్కరూ ఫిట్‌నెస్‌పై ఆసక్తి చూపుతున్నారు. ఆరోగ్యంగా ఉండేందుకు ఆహారపు అలవాట్లపై దృష్టి పెడుతున్నారు. అయినప్పటికీ ఊబకాయం సమస్య చాలామందికి ఇబ్బందిగా మారింది. బరువు తగ్గడానికి ఎన్నోరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈక్రమంలో కొంతమంది బ్లాక్ కాఫీ తాగి బరువు తగ్గాలని ప్రయత్నిస్తే, మరికొందరు మిల్క్ కాఫీ తాగి బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారు. బ్లాక్ కాఫీ తాగడం వల్ల త్వరగా బరువు తగ్గొచ్చని భావిస్తున్నారు. బ్లాక్ కాఫీ మెటబాలిజం బూస్టర్.
ఇది బరువు తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని భావిస్తారు. బ్లాక్ కాఫీలో ఉండే కెఫిన్ జీవక్రియకు తాత్కాలిక వేగాన్ని అందించడానికి పనిచేస్తుంది. తక్కువ సమయంలో ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తుంది. బ్లాక్ కాఫీ ఆకలిని తగ్గించడంలో కూడా పనిచేస్తుంది. అయితే దీనికి చాలా బ్యాలెన్స్ అవసరం. అలాగే మిల్క్ కాఫీ కూడా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. క్యాల్షియం, ప్రొటీన్ వంటి పోషకాలు మిల్క్ కాఫీలో ఉంటాయి. తక్కువ కొవ్వు లేదా స్కిమ్డ్ మిల్క్ ఉన్న కాఫీని మాత్రమే తాగాలి. అయితే అధిక కేలరీల కారణంగా మిల్క్ కాఫీ బ్లాక్ కాఫీలాగా జీవక్రియను పెంచదు.